AMAR SINGH HITS OUT AT MULAYAM SINGH FOR LAUDING PM NARENDRA MODI
ప్రధాని మోడీపై ములాయం పొగడ్తల వెనుక కుట్ర...అమర్ సింగ్ ఫైర్
ములాయం ప్రశంసలకు ప్రధాని మోడీ రియాక్షన్
ప్రధాని నరేంద్ర మోడీని ములాయం సింగ్ యాదవ్ పొగడ్తలతో ముంచెత్తడం వెనుక బీఎస్పీ, ఎస్పీల అవినీతి,అక్రమాలను కప్పిపుచ్చుకోవాలన్న కుట్రదాగి ఉందని సమాజ్వాది పార్టీ మాజీ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ ఆరోపించారు.
నరేంద్ర మోడీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలిచి మళ్లీ దేశ ప్రధాని కావాలంటూ లోక్సభలో బుధవారం సమాజ్వాది పార్టీ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీపై ములాయం సింగ్ యాదవ్ పొగడ్తల వెనుక కుట్ర దాగి ఉందని రాజ్యసభ సభ్యుడు, ములాయం పాత మిత్రుడు అమర్ సింగ్ ఆరోపించారు. సమాజ్వాది పార్టీ, బీఎస్పీ అవినీతిని కప్పిపుచ్చేందుకు వ్యూహాత్మకంగా ములాయంతో ఇలా మాట్లాడించారని ఆయన అభిప్రాయపడ్డారు.
ములాయం సింగ్ యాదవ్, మాయావతి యూపీ ముఖ్యమంత్రులుగా పనిచేసిన సమయంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ అక్రమాలను వెలికితీయించే ప్రయత్నాల్లో నరేంద్ర మోడీ సర్కారు ఉందన్నారు. అయితే గందరగోళం సృష్టించి తమ అవినీతిని కప్పిపుచ్చుకోవాలని సమాజ్వాది పార్టీ, బీఎస్పీలు భావిస్తున్నాయని వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీపై ములాయంతో పొగడ్తల వర్షం కురిపించారని పేర్కొన్నారు.
మోడీ సర్కారును గద్దె దించేందుకు ములాయం సింగ్ యాదవ్ తనయుడు అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాది పార్టీ ప్రయత్నిస్తుండగా...ప్రధాని నరేంద్ర మోడీ సమర్థుడని మెచ్చుకుంటూ, ఆయన మళ్లీ దేశ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నట్లు లోక్సభలో ములాయం వ్యాఖ్యలు చేయడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ములాయం సింగ్ యాదవ్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఎస్పీ-బీఎస్పీ కూటమికి ఎదురుదెబ్బ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
#MulayamBacksModi | Listen in to what Mulayam Singh Yadav said in the Lok Sabha today
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.