పవన్ కళ్యాణ్‌పై ఆమంచి కృష్ణ మోహన్ సంచలన వ్యాఖ్యలు
జగన్ ప్రభుత్వం వంద రోజుల పాలనపై పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించడంతో వైసీపీలోని కాపు నేతలు ఎదురుదాడి ప్రారంభించారు.
news18-telugu
Updated: September 15, 2019, 4:25 PM IST

ఆమంచి కృష్ణ మోహన్, పవన్ కళ్యాణ్
- News18 Telugu
- Last Updated: September 15, 2019, 4:25 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో కాపు నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి భయపడి కాపు నేతలు వైసీపీలో చేరుతున్నారని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి వంద రోజుల పాలన మీద స్పందించిన సమయంలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పథకాలు జనరంజకంగా ఉన్నాయని, పాలన మాత్రం జనవిరుద్ధంగా ఉందన్నారు. ఇటీవల టీడీపీ నేత తోట త్రిమూర్తులు ఆ పార్టీని వీడి వైసీపీలో చేరాలని నిర్ణయించారు. ఆయన ఈ రోజు వైసీపీలో చేరారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తోట త్రిమూర్తులు స్పందించారు. జగన్ మోహన్ రెడ్డికి భయపడి ఎవరూ వైసీపీలో చేరడం లేదన్నారు. ఆయన పాలనను చూసి పార్టీలో చేరుతున్నారని చెప్పారు. మరో కాపు నేత ఆమంచి కృష్ణ మోహన్ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ అలాంటి మాటలు అనడం దుర్మార్గం. ఆ మాట అనడం ద్వారా తనను తాను అవమానించుకున్నారు. ఆయన కూడా మా సామాజికవర్గానికి చెందిన నేత. భయపడకపోవడం, ఎదురొడ్డి పోరాడడం నా నైజం, తోట త్రిమూర్తులు నైజం. మా కులం నైజం. మాలో ఉండే లక్షణాలే పవన్ కళ్యాణ్‌లో కూడా ఉన్నాయనుకుంటున్నాం. పిరికితనంతో పార్టీ మారామని ఆయన అంటే.. పవన్ కళ్యాన్ కూడా పిరికివాడే కదా. జనసేనాని ఆ వ్యాఖ్యలు విత్ డ్రా చేసుకోవాలి. కాపులే కాదు, జగన్‌తో కలసి నడవడానికి ఇతర కులాల వారు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
జగన్ ప్రభుత్వం వంద రోజుల పాలనపై పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించడంతో వైసీపీలోని కాపు నేతలు ఎదురుదాడి ప్రారంభించారు. చంద్రబాబు ఐదేళ్లు పాలించినప్పుడు పవన్ కళ్యాణ్ ఈ బుక్లెట్ ఎందుకు రిలీజ్ చేయలేదని ప్రశ్నించారు.

— ఆమంచి కృష్ణ మోహన్, వైసీపీ నేత
Loading...