Home /News /politics /

ALOK VERMA BACK IN OFFICE AS A CBI CHIEF AFTER THREE MONTHS

సీబీఐ డైరెక్టర్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టిన ఆలోక్ వర్మ...

ఆలోక్ వర్మ (ఫైల్ ఫోటో)

ఆలోక్ వర్మ (ఫైల్ ఫోటో)

ఆలోక్ వర్మను సెలవు పై పంపుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తిరిగి ఆలోక్ వర్మను వెంటనే సీబీఐ డైరెక్టర్‌గా నియమించాలని ఆదేశించింది.

    సీబీఐ డైరెక్టర్‌గా తిరిగి ఆలోక్ వర్మను నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో తిరిగి బాధ్యతలు స్వీకరించారు ఆలోక్ వర్మ. ఢిల్లీలో సీబీఐ కార్యాలయానికి చేరుకున్న ఆయన తిరిగి బాధ్యతలు తీసుకున్నారు. ఆయన కేబిన్‌లోకి వెళ్లి కూర్చున్నారు. ఆయనను సెలవుపై ప్రభుత్వం పంపించినప్పటి నుంచి ఆయన గదిని మూసివేశారు.

    గత కొన్నాళ్లుగా సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానాలు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. రాకేశ్ ఆస్థానా లంచం తీసుకున్నాడని ఆరోపిస్తూ సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న అలోక్ వర్మ ఆయనపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసులో సీబీఐ స్వయంగా తన సిబ్బంది అయిన డీఎస్‌పీ దేవేంద్ర కుమార్‌ను అరెస్ట్ చేసింది.

    రాకేష్ ఆస్థానా, ఆలోక్ వర్మ


    అరెస్టును తప్పించుకోవడానికి రాకేష్ ఆస్థానా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మంగళవారం అర్ధరాత్రి ఈ విషయంలో జోక్యం చేసుకున్న ప్రభుత్వం అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానా.. ఇద్దరినీ సెలవుపై పంపింది. ఆస్థానాపై కేసును విచారిస్తున్న సీబీఐ అధికారి బస్సీని పోర్ట్ బ్లెయిర్‌కు బదిలీ చేసింది. తనను తప్పించడాన్ని సవాలు చేస్తూ అలోక్ వర్మ సుప్రీంను ఆశ్రయించారు.

    అలోక్ వర్మ(ఫైల్ ఫోటో)


    దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం... సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న ఆలోక్‌వర్మను సెలవుపై కేంద్రం పంపడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఆలోక్ వర్మను సెలవు పై పంపుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తిరిగి ఆలోక్ వర్మను వెంటనే సీబీఐ డైరెక్టర్‌గా నియమించాలని ఆదేశించింది.

    ప్రస్తుతం సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఎం నాగేశ్వరరావు. కేబినెట్‌ అపాయింట్‌మెంట్‌ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆయన కూడా సీబీఐ కార్యాలయంలోని 11వ అంతస్తులో ఉంటున్నారు.




    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Alok Verma, CBI, National, National News, Supreme Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు