ప్రధాని మోదీని అందుకే హగ్ చేసుకున్నా.. క్లారిటీ ఇచ్చిన రాహుల్‌గాంధీ

మోదీని కౌగిలించుకున్న రాహుల్ ఫైల్

పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కౌగిలించుకోవడం.. అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. అసలింతకు రాహుల్ అలా ఎందుకు చేసినట్టు? ఇన్నాళ్లూ ఈ విషయంలో ఎవ్వరికీ క్లారిటీలేదు. అందుకే ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చేశారు.

  • Share this:
    పుల్వామాలో భారతజవాన్ల మీద ఉగ్రవాదుల దాడిని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్న ఆయన.. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన రాహుల్.. పుల్వామా దాడిని తీవ్రంగా ఖండించారు. తన తండ్రి, నాన్నమ్మలు కూడా అలాగే చనిపోయారని... ఈ సందర్భంగా రాహుల్ ఉదహరించారు. ఈ సందర్భంగా తాను అప్పట్లో మోదీని పార్లమెంటు వేదికగా ఎందుకు ఆలింగనం చేసుకున్నాననే విషయాన్నీ వివరించారు.

    ఎవరి పట్లా ద్వేషభావం మంచిది కాదనే తాను భావిస్తానని రాహుల్ చెప్పారు. దాడుల కారణంగానే తాను ఇద్దరు కుటుంబసభ్యులను పోగొట్టుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ద్వేషాన్ని ఒక్క ప్రేమమాత్రమే జయించగలదని .. ఆందోళనలు, దాడులు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని తాను భావిస్తానని రాహుల్ తెలిపారు. పార్లమెంటులో తాను కౌగిలించుకున్నప్పుడు ఆయన ఆశ్చర్యపోతారనే విషయం తనకు తెలుసని, ఆ క్షణం ఏం జరుగుతుందో కూడా ఆయనకు అర్థం అయి ఉండదని, ఆయనకు జీవితంలో ప్రేమలేదనే విషయం తనకు అర్థమైందని రాహుల్ వివరించారు. తన కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని సైతం ప్రేమించాలనే ఉద్దేశంతోనే.. మోదీని హగ్ చేసుకున్నానని విద్యార్థులకు వివరించారు రాహుల్.

    పోయినేడాది పార్లమెంటులో ఎన్డీఏ సర్కారుపై అవిశ్వాసం ప్రవేశపెట్టినప్పుడు జరిగిన చర్చ సందర్భంగా.. రాహుల్ గాంధీ అనూహ్యంగా ప్రధాని మోదీ దగ్గరికెళ్లి ఆయనను కౌగిలించుకున్నారు. ఈ అంశం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. సోషల్ మీడియాలోనూ దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ విషయంపై తాజాగా క్లారిటీ ఇచ్చారు రాహుల్ గాంధీ.
    First published: