Home /News /politics /

ALL SET FOR THIRD PHASE OF GRAM PANCHAYAT POLLS IN TELANGANA MS

మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మొదటి రెండు విడతల ఎన్నికల ప్రక్రియలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. మూడో విడత ఎన్నికల ప్రక్రియను కూడా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఇప్పటికే ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు

    తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికల ఘట్టం తుది దశకు చేరుకుంది. బుధవారం రాష్ట్రంలో చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గం. నుంచి మధ్యాహ్నం 1గం. వరకు పోలింగ్‌ జరగనుంది. చివరి విడతలో.. మొత్తం 3,529 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా.. నల్గొండ, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని మూడు పంచాయతీల పరిధిలో నిలిచిపోయిన పలు వార్డులకు కూడా బుధవారం ఎన్నికలు జరగనున్నాయి.

    ఎన్నికలు జరగనున్న 3529 పంచాయతీల్లో 11667 మంది సర్పంచ్ అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. 577 సర్పంచ్ స్థానాలు, 8956 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ఇక వార్డుల విషయానికొస్తే.. 27,583 వార్డులకు గాను 67,316 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. 8,956 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. 10 గ్రామాలకు,185 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు.

    మొదటి రెండు విడతల ఎన్నికల ప్రక్రియలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. మూడో విడత ఎన్నికల ప్రక్రియను కూడా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఇప్పటికే ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
    First published:

    Tags: Gram Panchayat Elections, Telangana, Telangana News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు