• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • ALL SET FOR THE FIRST PHASE OF PANCHAYAT ELECTIONS IN ANDHRA PRADESH AND GOVERNMENT COMPLETED ARRANGEMENTS HERE ARE THE DETAILS PRN

AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు అంతా సిద్ధం.. తొలి దశ పోలింగ్ జరిగే గ్రామాలివే..

AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు అంతా సిద్ధం.. తొలి దశ పోలింగ్ జరిగే గ్రామాలివే..

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో తొలిదశ పంచాయతీ ఎన్నికల (AP Panchayat Elections) పోలింగ్ కు రంగం సిద్ధమైంది. రేపు (ఫిబ్రవరి 9న) రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. ఎన్నికల కమిషన్ (Election Commission) ఆదేశాల మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ (Panchayat Raj Department of Andhra Pradesh) ఏర్పాట్లను పూర్తి చేసింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు రంగం సిద్ధమైంది. రేపు (ఫిబ్రవరి 9న) రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ఏర్పాట్లను పూర్తి చేసింది. అనూహ్య ఘటనలు, బదిలీలు, లేఖాస్త్రాలు, ఫిర్యాదులు, ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య పంచాయతీ ఎన్నికల సీన్ పోలింగ్ వరకు చేరింది. మరికొన్ని గంటల్లో పల్లెపోరుపై బ్యాలెట్ ముద్ర పడనుంది. తొలి విడతలో భాగంగా 3249 సర్పంచ్ పదవులకు 32,502 వార్డు మెంబర్లు కోసం ఓటింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 525 గ్రామ పంచాయతీలు, 12,185 వార్డు మెంబర్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. పోలింగ్ కోసం 29,732 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు 3, 458 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా.., 3,594 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు.

    బ్యాలెట్ పద్దతిలో జరగనున్న పోలింగ్ కోసం 18,608 పెద్ద బ్యాలెట్ బాక్సులు, 8503 మధ్యరకం బ్యాలెట్ బాక్సులు. 21338 చిన్న బ్యాలెట్ బాక్సులను పోలింగ్ కేంద్రాలకు తరలించారు. అలాగే ఎన్నికల కోసం దాదాపు 90వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. వారిలో స్టేజ్ - 1 ఆర్ఓలు 1,130, స్టేజ్-2 ఆర్ఓలు-3,249, ఏఆర్ఓలు 1,432, పీఓలు 33,533, ఇతర పోలింగ్ సిబ్బంది 44, 392 మంది, జోనల్ అధికారులు 519, రూట్ అధికారులు 1,121, మైక్రో అబ్జర్వర్లు 3,046 మంది సిబ్బందిని నియమించారు. 215 డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి బ్యాలెట్ బాక్సుల పంపిణీ చేశారు. ఎన్నికల సిబ్బంది తరలింపు కోసం 5 కిలోమీటర్ల కంటే ఎక్కువగా దూరం ఉన్న పోలింగ్ కేంద్రాలకు 2,216 పెద్ద వాహనాలు, 5 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ఉన్న స్టేషన్లకు 1,412 చిన్నస్థాయి వాహనాలను సిద్ధం చేశారు.

    పోలింగ్ ఉదయం 6.30గంటలకు మొదలై మధ్యాహ్నం 3.30 గంటలకు పూర్తవుతుందని పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. మధ్యాహ్నం 4గంటల నుంచి సాయంత్రం 6.30 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన తెలిపారు. కౌంటింగ్ కోసం 14,535 సూపర్వైజర్లు, 37,750 మంది సిబ్బంది పని చేస్తారని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ పోలింగ్ స్టేషన్లోనే పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా బొప్పనపల్లి, వడ్డిగూడెం గ్రామపంచాయతీల్లో రేపు జరగాల్సిన పోలింగ్ ను రెండవదశకు వాయిదా వేసినట్లు గోపాలకృష్ణ ద్వివేదీ తెలిపారు. ఇక చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలపై తుదినిర్ణయం ఎస్ఈసీదేనని ద్వివేదీ స్పష్టం చేశారు.

    ఎన్నికలు జరిగే మండలాలు ఇవే

    • శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న ఎల్.ఎన్.పేట, లావేరు, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి మండలాలు

    • విశాఖపట్నం జిల్లా: అనకాపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని అచ్యుతాపురం, అనకాపల్లి, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు, కశింకోట, వి.మాడుగుల, మునగపాక, రాంబిల్లి, యలమంచిలి, బుచ్చియ్యపేట, చోడవరం

    • తూర్పు గోదావరి జిల్లా: కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్ల పరిధిలోని గొల్లప్రోలు, కాకినాడ రూరల్, కరప, పెదపూడి, పిఠాపురం, సామర్లకోట, తాళ్లరేవు, యు.కొత్తపల్లి, గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి, కోటనందూరు, పెద్దాపురం, ప్రత్తిపాడు, రంగంపేట, రౌతలపూడి, శంఖవరం, తొండగి, తుని, ఏలేశ్వరం మండలాలు

    • పశ్చిమగోదావరి జిల్లా: నర్సాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆకివీడు, భీమవరం, ఆచంట, కాళ్ల, మొగల్తూరు, నర్సాపురం, పాలకోడేరు, పాలకొల్లు, పోడూరు, ఉండి, వీరవాసరం, యలమంచిలి మండలాలు

    • కృష్ణాజిల్లా: విజయవాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని చందర్లపాడు, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల, కంకిపాడు, మైలవరం, నందిగామ, పెనుగంచిప్రోలు, పెనమలూరు, తోట్లవల్లూరు, వత్సవాయి, వీరుళ్లపాడు, విజయవాడ రూరల్ మండలాలు

    • గుంటూరు జిల్లా: తెనాలి రెవెన్యూ డివిజన్ లోని అమర్తలూరు, బాపట్ల, భట్టిప్రోలు, చేబ్రోలు, చెరుకుపల్లి, దుగ్గిరాల, కాకుమాను, కర్లపాలెం, కొల్లిపరం, కొల్లూరు, నగరం, నిజాంపట్నం, పి.వీ పాలెం, పొన్నూరు, తెనాలి, రేపల్లె, టి.చుండూరు, వేమూరు మండలాలు

    • ప్రకాశం జిల్లా: ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అద్దంకి, బల్లికురవ, చీమకుర్తి, చినగంజాం, చీరాల, ఇంకొల్లు, జె.పంగులరు, కారంచేడు, కొరిశపాడు, కొత్తపట్నం, మార్టూరు, మద్దిపాడు, ఎస్.జీ పాడు, ఒంగోలు, పర్చూరు, సంతమాగులూరు, సంతనూతలపాడు, వేటపాలెం, టంగుటూరు, యద్దనపూడి మండలాలు

    • శ్రీ పొట్టిశ్రీరాములు జిల్లా: కావలి రెవెన్యూ డివిజన్ పరిధిలోని అల్లూరు, బోగోలు, దగదర్తి, దత్తలూరు, జలదంకి, కలిగిరి, కావలి, కొండాపురం, వరికుంటపాడు మండలాలు

    • కర్నూలు జిల్లా: నంద్యాల, కర్నూలు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఆళ్లగడ్డ, చాగలమర్రి, దోర్నిపాడు, రుద్రవరం, సిరివెళ్ల, ఉయ్యాలవాడ, గోస్పాడు, నంద్యాల, బండి ఆత్మకూరు, మహానంది, ఆత్మకూరు, వెలుగోడు మండలాలు

    • అనంతపురం జిల్లా: కదిరి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న అమడగూరు, బుక్కపట్నం, గాండ్లపెంట, కదిరి, కొత్తచెరువు, ఎన్.పి.కుంట, నల్లమడ, ఓదులదేవర చెరువు, పుట్టపర్తి, తలుపుల, తనకల్లు మండలాలు

    • వైఎస్ఆర్ కడప జిల్లా: జమ్మలమడుగు, కడప, రాజంపేట రెవెన్యూ డివిజన్ల పరిధిలోని చాపాడు, మైదుకూరు, దువ్వూరు, ప్రొద్దుటూరు, రాజుపాలెం, ఖాజీపేట, బద్వేలు, అట్లూరు, బి.కోడూరు, గోపవరం, పారుమామిళ్ల, ఎస్.ఎ.కే.ఎన్ పాడు, కలసపాడు, బి.మఠం మండలాలు

    • చిత్తూరు జిల్లా: చిత్తూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న బంగారుపాళ్యం, చిత్తూరు, గంగాధర నెల్లూరు, గుడిపాల, ఐరాల, కార్వేటినగరం, నగరి, నారాయణవనం, నిండ్ర, పాలసముద్రం, పెనుమూరు, పూతలపట్టు, పుత్తూరు, అర్.సీ.పురం, ఎస్.ఆర్ పురం, తవణంపల్లి, వడమాలపేట, వెదురుకుప్పం, విజయపురం, యడమారి మండలాలు

    Published by:Purna Chandra
    First published: