తెలంగాణలో మునిసిపల్ పోరు.. రేపటి ఎన్నికలకు సర్వం సిద్ధం..

Telangana Municipal Elections 2020 : తెలంగాణలో పూర్తి స్థాయిలో తొలిసారి జరగనున్న మునిసిపల్ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. రాష్ట్రంలోని 9 నగరపాలక, 120 పురపాలక సంఘాల్లో బుధవారం పోలింగ్ జరగనుంది.

news18-telugu
Updated: January 21, 2020, 12:46 PM IST
తెలంగాణలో మునిసిపల్ పోరు.. రేపటి ఎన్నికలకు సర్వం సిద్ధం..
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తెలంగాణలో పూర్తి స్థాయిలో తొలిసారి జరగనున్న మునిసిపల్ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. రాష్ట్రంలోని 9 నగరపాలక, 120 పురపాలక సంఘాల్లో బుధవారం పోలింగ్ జరగనుంది. ఇందులో మొత్తం 50 లక్షల మందికి పైగా ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొననున్నారు. 45 వేల మంది సిబ్బంది పోలింగ్‌ విధుల్లో పాల్గొననున్నారు. ఈ సాయంత్రానికి ఎన్నికల సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోనున్నారు. రేపు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇప్పటికి.. మొత్తం కార్పొరేషన్లలో 325 డివిజన్లకు గాను ఒక వార్డు ఏకగ్రీవం కాగా పురపాలికల్లోని 2,727 వార్డుల్లో 80 ఏకగ్రీవం అయ్యాయి. కాగా, జీహెచ్‌ఎంసీ పరిధిలోని డబీర్‌పురా డివిజన్‌కు ఉపఎన్నిక జరుగుతోంది.

ఇదిలా ఉండగా.. ఈ నెల 24న ఎన్నికలు జరగనున్న కరీంనగర్‌ నగర పాలక సంస్థ పరిధిలో మాత్రం బుధవారం వరకు ఎన్నికల ప్రచారం జరగనుంది. అటు.. ఈ ఎన్నికల్లో దొంగ ఓట్లు పడకుండా ఈసీ ఓ వినూత్న ప్రయోగం చేయబోతోంది. దేశంలోనే ఏ ఎన్నికలలోనూ ప్రయోగించని " ఫేస్ రికగ్నిషన్" యాప్‌ను తొలిసారి ప్రయోగించబోతున్నారు. ఈ యాప్‌ను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కొంపల్లి మునిసిపాలిటీలోని 10 పోలింగ్ స్టేషన్లలో పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయనున్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: January 21, 2020, 12:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading