ఏపీలో రేపు రీ పోలింగ్‌కు సర్వం సిద్ధం.. ఐదు చోట్ల భారీ భద్రత

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలోని ఐదు పోలింగ్ బూత్‌లో జరిగే రీ పోలింగ్‌కు ఎన్నికల కమిషన్ భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేసింది.

 • Share this:
  మే 6 సోమవారం రాష్ట్రంలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు మూడు జిల్లాల పరిధిలోని ఐదు పోలింగ్ కేంద్రాలలో రీ-పోలింగ్ జరగనుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐదు పోలింగ్ కేంద్రాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ రెండింటికీ రీ పోలింగ్ నిర్వహిస్తారు.

  గుంటూరు జిల్లాలో నరసరావుపేట అసెంబ్లీ, నరసరావుపేట పార్లమెంటుకు చెందిన 94వ పోలింగ్ స్టేషన్ (కేశనుపల్లి - 956 మంది ఓటర్లు)లో రీ పోలింగ్ జరగనుంది.

  గుంటూరు పశ్చిమ అసెంబ్లీ, గుంటూరు పార్లమెంటు పరిధిలోని 244 పోలింగ్ స్టేషన్ (నల్లచెరువు - 1376 మంది ఓటర్లు)లో పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు.

  ప్రకాశం జిల్లా పరిధిలోని ఎర్రగొండపాలెం అసెంబ్లీ, ఒంగోలు పార్లమెంటు పరిధిలోని 247 పోలింగ్ స్టేషన్ (కలనూతల 1070 మంది ఓటర్లు)

  నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ, నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి 41 పోలింగ్ స్టేషన్ (ఇసుకపాలెం 1084 మంది ఓటర్లు)

  నెల్లూరు జిల్లా సూళ్ళూరు పేట అసెంబ్లీ, తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉండే 197 పోలింగ్ స్టేషన్ (అటకానితిప్ప 578 మంది ఓటర్లు)లో ఏర్పాట్లు పూర్తి చేశారు.
  First published: