Nizamabad MLC ByPolls: నేడే నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు, మీరు తెలుసుకోవాల్సిన అంశాలు

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరపున ముగ్గురు అభ్యర్ధులు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నుంచి సుభాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

news18-telugu
Updated: October 9, 2020, 6:25 AM IST
Nizamabad MLC ByPolls: నేడే నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు, మీరు తెలుసుకోవాల్సిన అంశాలు
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సామగ్రి పంపిణీ
  • Share this:
(మహేందర్, న్యూస్ 18 ప్రతినిధి, నిజామాబాద్)

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఎన్నికల అబ్జర్వర్ వీరబ్రహ్మయ్య, IAS, జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన ఎమ్మెల్సీ ఎన్నికల మెటీరియల్, మెన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రిసైడింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. మెటీరియల్ ఏమీ మిస్ కాకుండా తీసుకోవాలని, ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఎన్నికల నిబంధనలతో పాటుగా కోవిడ్ కు సంబంధించిన నిబంధనలు కూడా పాటించేందుకు అనుగుణంగా మెటీరియల్ ఇస్తున్నామన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ కు 4 పీపీఈ కిట్స్ ఇస్తున్నామని, ఓటరుకు సపరేట్‌గా పీపీఈ కిట్స్ ఇస్తున్నామన్నారు. ప్రతి పోలింగ్ ఆఫీసర్ తప్పకుండా మాస్క్, గ్లౌజ్, ఫేస్ షీల్డ్ ధరించాలని, పోలింగ్ స్టేషన్ కు 10 చొప్పున శానిటైజర్లు ఇస్తున్నామన్నారు. హెల్ప్ డెస్క్ వద్ద, వెయిటింగ్ హాల్లో శానిటైజర్లు పెట్టాలని, కోవిడ్ కు సంబంధించిన ఫ్లెక్సీలు ప్రతి పోలింగ్ స్టేషన్ ముందు ఓటు వేయడానికి వచ్చిన వారికి కనిపించేవిధంగా కట్టించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ ఆఫీసర్ కు గాని, సిబ్బందికి, ఓటరుకు గాని కోవిడ్ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.

ఎన్నిక బ్యాలెట్ పేపర్ తో జరుగుతుందని, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇచ్చిన పెన్నుతో మాత్రమే వోట్ వేయాలని, వేరే పెన్నుతో వేస్తే ఓటు చెల్లదని స్పష్టం చేశారు. ఐడెంటిఫైయింగ్ అధికారిగా ఎంపీడీవో / మున్సిపల్ కమిషనర్ ఉంటారన్నారు. సెక్టోరల్ ఆఫీసర్ ఎంపీడీవోల డౌట్లు క్లియర్ చేయాలన్నారు. సెల్ ఫోన్స్ పోలింగ్ కేంద్రం లోపలికి తేకూడదని, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. కొవిడ్ పాజిటివ్ ఉన్న వ్యక్తులకు ఎన్నికల కమిషన్ రెండు రకాల ఆప్షన్స్ ఇచ్చిందని, వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా లేదా సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో నేరుగా ఓటు వినియోగించుకోవచన్నారు.

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులు తీసుకుని వెళ్తున్న ఎన్నికల సిబ్బంది


పోలింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది. 50 పోలింగ్ స్టేషన్లను 15 రూట్లుగా విభజించారు. ప్రతి రూటుకు ఒక సెక్టోరల్ అధికారిని నియమించారు. కోవిడ్ ప్రోటో కాల్ ప్రకారం ఎలక్షన్ జరగాలని ఎన్నికల కమిషన్ చెప్తుంది. దీంతో కోవిడ్ పేషెంటుకు వారి ఇంటి దగ్గర నుండి పిక్ అప్ చేయనున్నారు. సొంత వాహనం లేదా అంబులెన్స్ ను ఏర్పాటు చేస్తారు. మెడికల్ ఆఫీసర్, ఏఎన్ఎం హెల్ప్ డెస్క్ దగ్గర ఉంటారు.

ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం వద్ద కోవిడ్ 19 డెస్క్


ఉమ్మడి జిల్లాలో 824 మంది స్ధానిక సంస్ధల ఓటర్లు ఉండగా.. 50 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. నిజామాబాద్ నగర పాలక సంస్ధలో అత్యధికంగా 67 మంది ఓటర్లు ఉండగా.. చందూరు మండలంలో అత్యల్పంగా 4గురు ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 14 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు.. వెబ్ కాస్టింగ్ తో పాటు వీడియో చిత్రీకరణ చేయనున్నారు. 50 పోలింగ్ కేంద్రాల పర్యావేక్షణకు 15 రూట్లుగా విభజించి, సెక్టార్ అధికారులను నియమించారు. 399 మంది సిబ్బందిని పోలింగ్ విధులకు కేటాయించారు. 24 మంది ఓటర్లకు పాజిటివ్ ఉండగా, పోస్టల్ బ్యాలెట్ కు ఇద్దరు దరఖాస్తు చేసుకున్నారు.నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరపున ముగ్గురు అభ్యర్ధులు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, బీజేపీ అభ్యర్ధిగా లక్ష్మినారాయణ, కాంగ్రెస్ అభ్యర్ధిగా సుభాష్ రెడ్డి తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 9, 2020, 6:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading