Home /News /politics /

నేడే హుజూర్‌నగర్ పోలింగ్... మహారాష్ట్ర, హర్యానాల్లో కూడా...

నేడే హుజూర్‌నగర్ పోలింగ్... మహారాష్ట్ర, హర్యానాల్లో కూడా...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాలు, హర్యానాలోని 90 సీట్లకు, దీంతోపాటు 51చోట్ల ఉప ఎన్నికలు జరగనున్నాయి.

  దేశంలో పలుచోట్ల నేడు ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాలు, హర్యానాలోని 90 సీట్లకు, వాటితోపాటు 51 చోట్ల ఉప ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలోని హుజూర్‌నగర్‌లో కూడా బైపోల్స్ జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లోనూ భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బంది ఈవీఎంలతో తమకు కేటాయించిన పోలింగ్ బూత్‌లకు చేరుకున్నారు. కాసేపట్లో పోలింగ్ జరగనుంది. 24వ తేదీ గురువారం రోజు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. పోలింగ్‌ నేపథ్యంలో హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో 144 సెక్షన్‌ విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలతో భద్రతను పెంచినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా అభ్యర్థులపై ఎన్నికల సంఘం గట్టి నిఘా ఉంచింది. నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో వాహన తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. రౌడీ షీటర్లు, పాత నేరస్థుల కదలికలపై నిఘా పెంచారు. లైసెన్స్డ్‌ వెపన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

  మహారాష్ట్ర, హర్యానా రెండు చోట్ల బీజేపీ ప్రభుత్వమే ఉంది. యూపీలోని పలు చోట్ల ఉప ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ బీజేపీ సర్కారు ఉంది. తెలంగాణలోని హుజూర్‌నగర్‌లో 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ పద్మావతి రెడ్డి, టీఆర్ఎస్ తరఫున సైదిరెడ్డి, బీజేపీ నుంచి రామారావు, టీడీపీ తరఫున చావా కిరణ్మయి పోటీలో ఉన్నారు. ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే పోరుసాగనున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

  మా చెల్లిమీద చెయ్యేస్తావా?.. యువకుడిని రఫ్ఫాడించిన యువతి
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Huzur nagar by election 2019, Huzurnagar bypoll 2019, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు