నేడే కరీంనగర్ కార్పొరేషన్ ఫలితాలు... టీఆర్ఎస్ హవా కొనసాగుతుందా? బీజేపీ గండికొడుతుందా?

కౌంటింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మొత్తం కౌంటింగ్ ప్రక్రియ సీసీ కెమెరాలో రికార్డ్ చేయనున్నారు.

news18-telugu
Updated: January 27, 2020, 5:41 AM IST
నేడే కరీంనగర్ కార్పొరేషన్ ఫలితాలు... టీఆర్ఎస్ హవా కొనసాగుతుందా? బీజేపీ గండికొడుతుందా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నేడు జరగబోయే కరీంనగర్ నగరపాలక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. 60డివిజన్లకు గాను 2 డివిజన్ లు ఏకగ్రీవం అయ్యాయి. మిగితా 58 డివిజన్లకు సంబంధించి నేటి ఉదయం 7 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొత్తం 3 రౌండ్ల లో ఓట్ల లెక్కిపు జరుగుతుండగా.. ఇందుకు సంబంధించి 58 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 58 మంది కౌంటింగ్ సూపర్ వైజర్లు, ఒకరికి ఇద్దరు అసిస్టెంట్లు, 20 మంది మైక్రో అబ్జర్వర్లను అధికారులు నియమించారు. ఈ కౌంటింగ్ ప్రక్రియలో మొదటగా డివిజన్ ల వారిగా పోస్టల్ బ్యాలెట్ల్ ను లెక్కిస్తారు. నగరపాలక సంస్థ మొత్తం 500 లకు పైగా పోస్టల్ బ్యాలెట్స్ ను ఇష్యూ చేసింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనంతరం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. డివిజన్ల వారీగా ఓట్లను లెక్కిస్తారు. 25 ఓట్లు ఒక కట్ట కట్టి... రౌండుకు వెయ్యి ఓట్లను లెక్కిస్తారు.

కౌంటింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మొత్తం కౌంటింగ్ ప్రక్రియ సీసీ కెమెరాలో రికార్డ్ చేయనున్నారు. పోటీ చేసిన అభ్యర్థిని గాని వారి తరుపున ఏజెంట్ గానీ ఒక్కరినే కౌంటింగ్ హాల్ లోకి అనుమతిస్తారు. కౌంటింగ్ వద్ద భారీ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్ లోకి సెల్ ఫోన్లు, అగ్గిపెట్టెలు, మారణాయుధాలు తీసుకురావద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
First published: January 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు