Home /News /politics /

ALL SET FOR FIRST PHASE PANCHAYT ELECTIONS NOMINATIONS IN ANDHRA PRADESH HERE ARE THE DETAILS PRN

AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల నామినేషన్లకు అంతా సిద్ధం... తొలివిడత ఎన్నికలు జరిగే మండలాలివే...

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల తొలివిడత నామినేషన్లకు రంగం సిద్ధం

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల తొలివిడత నామినేషన్లకు రంగం సిద్ధం

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలకు (Andhra Pradesh Panchayat Elections) రంగం సిద్ధమైంది. నాలుగు దశల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కాబోతంది.

  ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నాలుగు దశల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కాబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 మండలాల్లోని దాదాపు 4వేల గ్రామ పంచాయతీల్లో తొలి విడత ఎన్నికల నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 31తో నామినేషన్ల దాఖలుకు గడువు పూర్తికానుంది. ఫిబ్రవరి 1న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 2న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తారు. ఫిబ్రవరి 3న అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఫిబ్రవరి 4న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. ఫిబ్రవరి 9న ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలిగం ప్రక్రియ కొనసాగుతుంది. అదే రోజు సాయంత్రం 4గంటల నుంచి లెక్కింపు ప్రారంభమవుతుంది. సాయంత్రం 7గంటల లోపు ఫలితాలను వెల్లడిస్తారు.

  తొలి విడతలో ఎన్నికలు జరిగే మండలాలు ఇవే

  • శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న ఎల్.ఎన్.పేట, లావేరు, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి మండలాలు

  • విశాఖపట్నం జిల్లా: అనకాపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని అచ్యుతాపురం, అనకాపల్లి, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు, కశింకోట, వి.మాడుగుల, మునగపాక, రాంబిల్లి, యలమంచిలి, బుచ్చియ్యపేట, చోడవరం

  • తూర్పు గోదావరి జిల్లా: కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్ల పరిధిలోని గొల్లప్రోలు, కాకినాడ రూరల్, కరప, పెదపూడి, పిఠాపురం, సామర్లకోట, తాళ్లరేవు, యు.కొత్తపల్లి, గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి, కోటనందూరు, పెద్దాపురం, ప్రత్తిపాడు, రంగంపేట, రౌతలపూడి, శంఖవరం, తొండగి, తుని, ఏలేశ్వరం మండలాలు

  • పశ్చిమగోదావరి జిల్లా: నర్సాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆకివీడు, భీమవరం, ఆచంట, కాళ్ల, మొగల్తూరు, నర్సాపురం, పాలకోడేరు, పాలకొల్లు, పోడూరు, ఉండి, వీరవాసరం, యలమంచిలి మండలాలు

  • కృష్ణాజిల్లా: విజయవాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని చందర్లపాడు, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల, కంకిపాడు, మైలవరం, నందిగామ, పెనుగంచిప్రోలు, పెనమలూరు, తోట్లవల్లూరు, వత్సవాయి, వీరుళ్లపాడు, విజయవాడ రూరల్ మండలాలు

  • గుంటూరు జిల్లా: తెనాలి రెవెన్యూ డివిజన్ లోని అమర్తలూరు, బాపట్ల, భట్టిప్రోలు, చేబ్రోలు, చెరుకుపల్లి, దుగ్గిరాల, కాకుమాను, కర్లపాలెం, కొల్లిపరం, కొల్లూరు, నగరం, నిజాంపట్నం, పి.వీ పాలెం, పొన్నూరు, తెనాలి, రేపల్లె, టి.చుండూరు, వేమూరు మండలాలు

  • ప్రకాశం జిల్లా: ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అద్దంకి, బల్లికురవ, చీమకుర్తి, చినగంజాం, చీరాల, ఇంకొల్లు, జె.పంగులరు, కారంచేడు, కొరిశపాడు, కొత్తపట్నం, మార్టూరు, మద్దిపాడు, ఎస్.జీ పాడు, ఒంగోలు, పర్చూరు, సంతమాగులూరు, సంతనూతలపాడు, వేటపాలెం, టంగుటూరు, యద్దనపూడి మండలాలు

  • శ్రీ పొట్టిశ్రీరాములు జిల్లా: కావలి రెవెన్యూ డివిజన్ పరిధిలోని అల్లూరు, బోగోలు, దగదర్తి, దత్తలూరు, జలదంకి, కలిగిరి, కావలి, కొండాపురం, వరికుంటపాడు మండలాలు

  • కర్నూలు జిల్లా: నంద్యాల, కర్నూలు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఆళ్లగడ్డ, చాగలమర్రి, దోర్నిపాడు, రుద్రవరం, సిరివెళ్ల, ఉయ్యాలవాడ, గోస్పాడు, నంద్యాల, బండి ఆత్మకూరు, మహానంది, ఆత్మకూరు, వెలుగోడు మండలాలు

  • అనంతపురం జిల్లా: కదిరి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న అమడగూరు, బుక్కపట్నం, గాండ్లపెంట, కదిరి, కొత్తచెరువు, ఎన్.పి.కుంట, నల్లమడ, ఓదులదేవర చెరువు, పుట్టపర్తి, తలుపుల, తనకల్లు మండలాలు

  • వైఎస్ఆర్ కడప జిల్లా: జమ్మలమడుగు, కడప, రాజంపేట రెవెన్యూ డివిజన్ల పరిధిలోని చాపాడు, మైదుకూరు, దువ్వూరు, ప్రొద్దుటూరు, రాజుపాలెం, ఖాజీపేట, బద్వేలు, అట్లూరు, బి.కోడూరు, గోపవరం, పారుమామిళ్ల, ఎస్.ఎ.కే.ఎన్ పాడు, కలసపాడు, బి.మఠం మండలాలు

  • చిత్తూరు జిల్లా: చిత్తూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న బంగారుపాళ్యం, చిత్తూరు, గంగాధర నెల్లూరు, గుడిపాల, ఐరాల, కార్వేటినగరం, నగరి, నారాయణవనం, నిండ్ర, పాలసముద్రం, పెనుమూరు, పూతలపట్టు, పుత్తూరు, అర్.సీ.పురం, ఎస్.ఆర్ పురం, తవణంపల్లి, వడమాలపేట, వెదురుకుప్పం, విజయపురం, యడమారి మండలాలు

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap local body elections, East Godavari Dist, Gram Panchayat Elections, Nimmagadda Ramesh Kumar, Srikakulam, Visakhapatnam, Vizianagaram, West Godavari

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు