తెలంగాణలో సీమాంధ్రుల మధ్య చిచ్చుపెట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో ఉన్నవారంతా ఇక్కడి బిడ్డలేనని, సీమాంధ్రులు ఎలాంటి భయాందోలన చెందాల్సిన అవసరం లేదన్నారు. సికింద్రాబాద్లో నిర్వహించిన టీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్ మేనిఫెస్టోను విడుదల చేశారు. మరోవైపు మల్కాజ్గిరిలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. నాలుగున్నరేళ్లలో కేసీఆర్ గుర్తుంచుకునేలా ఒక్కపనీ చేయలేదని చెప్పారు. హబ్సిగూడలో చంద్రబాబు ప్రచారం చేస్తుండగా, టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుతగిలారు. ‘చంద్రబాబు గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు.
Read More