Prakash Javadekar: అప్పటిలోగా దేశంలోని అందరికీ వ్యాక్సిన్.. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కౌంటర్

ప్రకాశ్ జవదేకర్(ఫైల్ ఫొటో)

భారత్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్‌పై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.

  • Share this:
    భారత్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్‌పై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తవుతుందని శుక్రవారం ప్రకాశ్ జవదేకర్ అన్నారు. అయితే దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేసిన కొద్ది గంటల్లోనే.. ప్రకాశ్ జవదేకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కాగా, వ్యాక్సినేషన్‌పై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. దేశంలో కేవలం మూడు శాతం జనాభాకు మాత్రమే వ్యాక్సిన్ అందిందని విమర్శించారు. కరోనా కట్టడిలో.. వ్యాక్సిన్‌ వేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని తీవ్ర విమర్శలు చేశారు.

    కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేవకర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘డిసెంబర్ నాటికి దేశంలో 216 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులోకి వస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ గతవారం తెలిపింది. అంటే కనీసం 108 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్ పొందే అవకాశం ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ డిసెంబర్ 2021 వరకు ఇండియాలో అందరికీ వ్యాక్సిన్ అందజేయబడుతుందని రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాలి’అని తెలిపారు.

    రాహుల్ గాంధీ డ్రామా అనే పదాన్ని ఉపయోగించడంపై జవదేకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంక్షోభ సమయంలో ఇలాంటి పదాలను ఉపయోగించడం.. కోవిడ్ -19 మహమ్మారి పరిస్థితిని నియంత్రించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అవమానించడానికి సంబంధించినదని అన్నారు.





    ‘ఇప్పటివరకు దేశంలో 20 కోట్ల వ్యాక్సిన్లను అందజేశారు. డోస్‌ల పరంగా భారత్ రెండవ స్థానంలో ఉంది. టీకా రేట్ల గురించి రాహుల్ గాంధీ ఒకవేళ ఆందోళన చెందుతుంటే.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కోవిడ్ -19 టీకా కార్యక్రమాలను ఎలా నిర్వహిస్తున్నాయనే దానిపై ఆయన దృష్టి పెట్టాలి. 18-45 సంవత్సరాల మధ్య వయస్సు గలవారికి వ్యాక్సిన్‌ కోసం కోటాలు కేటాయించినప్పటికీ ఆ రాష్ట్రాలు టీకాలు వేయలేకపోయాయి’అంటూ ప్రకాశ్ జవదేకర్ రాహుల్‌పై ఫైర్ అయ్యారు.
    Published by:Sumanth Kanukula
    First published: