ఏపీ అసెంబ్లీలో అందరి దృష్టి ఆ ఇద్దరు ఎమ్మెల్యేల మీదే...

తమ పార్టీలోకి రావాలంటే ఎమ్మెల్యే, పార్టీ పదవులకు రాజీనామ చేసి వైసీపీలో చేరాలని గతంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కండిషన్ పెట్టారు. ఈ కండిషన్ వల్లే వైసీపీలో చేరాలని భావించినా... వంశీ, మద్దాలి గిరి కూడా చేరకుండా ఉండిపోయారు.

news18-telugu
Updated: January 19, 2020, 7:11 PM IST
ఏపీ అసెంబ్లీలో అందరి దృష్టి ఆ ఇద్దరు ఎమ్మెల్యేల మీదే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో అందరి దృష్టి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల మీదే ఉంది. ఒకరు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, మరొకరు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్. ఈ ఇద్దరూ టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఈరోజు జరిగిన టీడీఎల్పీ సమావేశానికి కూడా హాజరుకాలేదు. దీంతో అసెంబ్లీ సమావేశాల్లో రేపు జగన్ మోహన్ రెడ్డి మూడురాజధానులు, సీఆర్డీఏ చట్టం మార్పు బిల్లులను ఆర్థిక బిల్లుల రూపంలో ప్రవేశపెడితే వాటి మీద ఓటింగ్‌కు పట్టుబట్టాలని టీడీపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ముందస్తుగా తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. విప్‌ను ధిక్కరించి వారిద్దరూ వైసీపీకి అనుకూలంగా ఓటు వేస్తారా? అసలు ఓటింగ్‌లోనే పాల్గొనకుండా వాకౌట్ చేస్తారా? లేకపోతే ఓటింగ్‌లో టీడీపీ చెప్పినట్టే ఓటు వేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వల్లభనేని వంశీ, మద్దాలి గిరి టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే... వారి మీద చర్యలు తీసుకోవాలని, వారి ఎమ్మెల్యే పదవిపై వేటు వేయాలని స్పీకర్‌ను టీడీపీ కోరనుంది. తమ పార్టీలోకి రావాలంటే ఎమ్మెల్యే, పార్టీ పదవులకు రాజీనామ చేసి వైసీపీలో చేరాలని గతంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కండిషన్ పెట్టారు. ఈ కండిషన్ వల్లే వైసీపీలో చేరాలని భావించినా... వంశీ, మద్దాలి గిరి కూడా చేరకుండా ఉండిపోయారు. జగన్‌కు మద్దతిచ్చినా టీడీపీకి దూరంగా ఉంటున్నారు.

First published: January 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు