Home /News /politics /

అంతా గవర్నర్ చేతుల్లోనే.. జగన్, చంద్రబాబులో టెన్షన్ టెన్షన్

అంతా గవర్నర్ చేతుల్లోనే.. జగన్, చంద్రబాబులో టెన్షన్ టెన్షన్

బిశ్వభూషణ్, వైఎస్ జగన్, చంద్రబాబు (ఫైల్ ఫోటో)

బిశ్వభూషణ్, వైఎస్ జగన్, చంద్రబాబు (ఫైల్ ఫోటో)

ప్రస్తుతం గవర్నర్ పరిధిలో తీసుకోవాల్సిన రెండు నిర్ణయాల్లో ఏవీ తమకు అనుకూలంగా, వ్యతిరేకంగా వస్తాయో అని టీడీపీ, వైసీపీలో టెన్షన్ నెలకొంది.

    ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ కీలకంగా మారిపోయారు. సాధారణంగా కీలకమైన అంశాల్లో గవర్నర్ పాత్ర అంతగా ఉండదు. కానీ ప్రస్తుతం గవర్నర్ వద్దకు చేరిన రెండు అంశాలు మాత్రం అత్యంత ప్రాధాన్యమైనవి కావడంతో... వీటిపై ఆయన ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఆసక్తికరంగా మారింది. పరిపాలన వికేంద్రీకరణ, సీర్డీయే రద్దు బిల్లులను ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపింది. అయితే వీటిని ఆమోదించడం రాజ్యంగ విరుద్ధమని... వీటిని రాష్ట్రపతికి నివేదించాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఈ మేరకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు.

    మరోవైపు శాసనప్రక్రియ ద్వారా తన వద్దకు చేరిన ఫైలును గవర్నర్ ఆమోదిస్తారనే ధీమాలో అధికార వైసీపీ ఉంది. దీంతో మూడు రాజధానుల అంశంపై గవర్నర్ అధికార పార్టీకి అనుకూలమైన నిర్ణయమే తీసుకుంటారా లేక అనూహ్యంగా ఈ బిల్లుపై కేంద్రం లేదా రాష్ట్రపతి సలహా తీసుకుంటారా ? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ఏపీ మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారం కూడా ప్రస్తుతం గవర్నర్ కోర్టులోనే ఉంది. ఏపీ ప్రభుత్వం తనను తిరిగి ఎస్ఈసీగా నియమించే విషయంలో జాప్యం చేస్తోందని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మళ్లీ ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో... వెంటనే దీనిపై గవర్నర్‌ను కలవాలని హైకోర్టు ఆయనకు సూచించింది. దీంతో ఆయన గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరడంతో... ఈ రోజు ఉదయం 11.30 గంటలకు అపాయింట్‌మెంట్ లభించింది.

    Governor biswabhushan harichandan, ap news, three capital news, nimmagadda Ramesh kumar, ap cm ys jagan mohan reddy, chandrababu naidu, ap news, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఏపీ న్యూస్, మూడు రాజధానుల బిల్లు, నిమ్మగడ్డ రమేశ్ కుమార్, చంద్రబాబునాయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
    నిమ్మగడ్డ రమేశ్ కుమార్ (ఫైల్ ఫోటో)


    గవర్నర్‌తో నిమ్మగడ్డ సమావేశం తరువాత ఆయనను తిరిగి ఏపీ ఎస్ఈసీగా నియమించే విషయంలో వెంటనే నిర్ణయం ఉంటుందా లేదా అన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ నిమ్మగడ్డను గవర్నర్ తిరిగి ఏపీ ఎస్ఈసీగా నియమిస్తే... వైసీపీకి నైతికంగా ఇబ్బందులు తప్పవు. ఇక అది టీడీపీకి నైతికంగా కలిసొచ్చే అంశంగా మారనుంది. ఇలా ప్రస్తుతం గవర్నర్ పరిధిలో తీసుకోవాల్సిన రెండు నిర్ణయాల్లో ఏవీ తమకు అనుకూలంగా, వ్యతిరేకంగా వస్తాయో అని టీడీపీ, వైసీపీలో టెన్షన్ నెలకొంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP governor viswabhushan, Chandrababu naidu, Nimmagadda Ramesh Kumar

    తదుపరి వార్తలు