ఇలాంటి మేనిఫెస్టో చూసి ఉండరు : మద్యంపై 50% డిస్కౌంట్, పండుగకు మేకలు మహిళలకు బంగారం ఫ్రీ..

Sanjhi Virasat Party's poll promise : ఎన్నికలవేళ రాజకీయ పార్టీలు 'ఉచిత' మంత్రాన్ని జపించడం కామనే కానీ.. మరీ ఈ స్థాయిలో పథకాలను ప్రకటించడంపై చాలామంది ముక్కున వేలేసుకుంటున్నారు. సాంఝి విరాసత్ పార్టీ తరుపున ఈశాన్య ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న అమిత్ శర్మ.. తన ఎన్నికల ప్రచార పోస్టర్‌లో ఈ హామీలను ముద్రించారు.

news18-telugu
Updated: April 17, 2019, 2:41 PM IST
ఇలాంటి మేనిఫెస్టో చూసి ఉండరు : మద్యంపై 50% డిస్కౌంట్, పండుగకు మేకలు మహిళలకు బంగారం ఫ్రీ..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 17, 2019, 2:41 PM IST
ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా పార్టీలు జనాకర్షక పథకాలతో ముందుకొస్తుంటాయి. ప్రత్యర్థులతో పోటాపోటీగా ఒకరిని మించి మరొకరు 'ఉచిత' స్కీములను ప్రకటిస్తుంటారు. గెలిస్తే.. ఫ్రీగా ల్యాప్‌టాప్‌లు ఇస్తామని ఒక పార్టీ ఆఫర్ ఇస్తే.. ఉచితంగా కలర్ టీవీలు ఇస్తామని మరో పార్టీ ఆఫర్ చేస్తుంది. ఏం చేసైనా సరే.. ఓట్లు కొల్లగొట్టాలన్న తాపత్రయంలో ఇలా ఉచిత స్కీములను జనం పైకి వదులుతుంటారు. తాజాగా ఢిల్లీలోనూ సాంఝి విరాసత్ పార్టీ 'ఉచిత' స్కీములతో తమ మేనిఫెస్టో ప్రకటించింది.

తమ పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రజలకు మద్యంపై 50% డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించింది. అంతేనా.. ముస్లింలకు ఈద్ పండుగ సమయంలో ఉచితంగా మేకలు, మహిళలకు ఉచితంగా బంగారం ఇస్తామని హామీ ఇచ్చింది. ఎన్నికలవేళ రాజకీయ పార్టీలు ఉచిత మంత్రాన్ని జపించడం కామనే కానీ.. మరీ ఈ స్థాయిలో పథకాలను ప్రకటించడంపై చాలామంది ముక్కున వేలేసుకుంటున్నారు. సాంఝి విరాసత్ పార్టీ తరుపున ఈశాన్య ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న అమిత్ శర్మ.. తన ఎన్నికల ప్రచార పోస్టర్‌లో ఈ హామీలను ముద్రించారు.


దేశంలో ఆయా రాజకీయ పార్టీలు కేజీ టూ పీజీ ఉచిత విద్య అంటుంటే.. సాంఝి పార్టీ మాత్రం పీహెచ్‌డీ వరకు ఉచిత విద్య అందిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఢిల్లీ విద్యార్థులందరికీ ఉచిత బస్సు/మెట్రో సదుపాయం, ఉచిత రేషన్, ఆడ శిశువు జన్మిస్తే రూ.50వేలు నగదు అందజేత, ఆడబిడ్డ పెళ్లికి రూ.2,50,000, నిరుద్యోగులకు నెలకు రూ.10వేలు, వితంతువులు, వికాలంగులు, వృద్దులకు ప్రతీ నెలా రూ.5వేలు పెన్షన్, రూ.1లక్ష వరకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత ట్రీట్‌మెంట్ వంటి హామీలను సాంఝి విరాసత్ తమ మేనిఫెస్టోలో పెట్టింది. అయితే ఈ మేనిఫెస్టో ఆ పార్టీకి ఎంతమేర ఓట్లు తీసుకొస్తుందన్నది ఎన్నికల్లో తేలనుంది.కాగా, ఢిల్లీలో ఎన్నికల నామినేషన్లు ఏప్రిల్ 16 నుంచి ప్రారంభం కానున్నాయి. అక్కడి ఏడు లోక్‌సభ స్థానాలకు ఒకే విడతలో మే 12న ఎన్నికలు జరగనున్నాయి.
First published: April 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...