జనసేనకు మరో నేత గుడ్ బై.. రాజీనామా చేసిన ఆకుల..

Akula Satyanarayana quits Janasena : ఎన్నికలకు కొద్ది నెలల ముందు జనసేన పార్టీలో చేరిన ఆయన.. రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుంచి పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటున్నారు.

news18-telugu
Updated: October 5, 2019, 1:17 PM IST
జనసేనకు మరో నేత గుడ్ బై.. రాజీనామా చేసిన ఆకుల..
పవన్‌తో డీఎంఆర్ శేఖర్, ఆకుల సత్యనారాయణ
  • Share this:
మాజీ ఎమ్మెల్యే, జనసేన నేత ఆకుల సత్యనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని పార్టీ కార్యాలయానికి పంపించారు. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఘోర పరాభవం తర్వాత ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. రావెల్ కిశోర్ బాబు, చింతల పార్థసారథి, మారంశెట్టి రాఘవయ్య, అద్దేపల్లి శ్రీధర్‌ ఇప్పటికే పార్టీని వీడారు. తాజాగా ఆ జాబితాలో ఆకుల సత్యనారాయణ కూడా చేరిపోయారు. సత్యనారాయణ త్వరలోనే జగన్‌ను కలిసి వైసీపీలో చేరబోతున్నారని
ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు జనసేన పార్టీలో చేరిన ఆయన.. రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుంచి పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటున్నారు.జనసేనలో తగిన ప్రాధాన్యం లేకపోవడం.. భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా కనిపిస్తుండటంతోనే ఆయన పార్టీ మారబోతున్నట్టు సమాచారం.

First published: October 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు