అలాంటి రాజకీయం కుదరదు : పవన్ కల్యాణ్‌పై జనసేన నేత విమర్శలు

పవన్ కల్యాణ్ కుల సమీకరణాల ఆధారంగా రాజకీయాలు చేశారని ఆకుల సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. అంటే కేవలం కాపు కుల ఓటు బ్యాంకును నమ్ముకుని ఆయన రాజకీయం చేయాలనుకున్నారని సత్యనారాయణ పరోక్ష ఆరోపణలు చేస్తున్నారు.

news18-telugu
Updated: June 21, 2019, 3:04 PM IST
అలాంటి రాజకీయం కుదరదు : పవన్ కల్యాణ్‌పై జనసేన నేత విమర్శలు
పవన్ కళ్యాణ్
  • Share this:
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సొంత పార్టీ నేత ఆకుల సత్యనారాయణ పరోక్షంగా విమర్శలు చేశారు. కుల సమీకరణాలను నమ్ముకుని రాజకీయాలు చేయాలంటే కుదరదని, తద్వారా భంగపాటే ఎదురవుతుందని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ ఆయన ఆలోచనలను జనంలోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారని అన్నారు. రాబోయే ఐదేళ్లు పవన్ ప్రజల్లో ఉంటారో లేదో కాలమే నిర్ణయిస్తుందన్నారు.తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శుక్రవారం ఆకుల సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.

పవన్ కల్యాణ్ కుల సమీకరణాల ఆధారంగా రాజకీయాలు చేశారని ఆకుల సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. అంటే కేవలం కాపు కుల ఓటు బ్యాంకును నమ్ముకుని ఆయన రాజకీయం చేయాలనుకున్నారని సత్యనారాయణ పరోక్ష ఆరోపణలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఆకుల సత్యనారాయణ బీజేపీలో చేరుతారన్న ప్రచారం కూడా జోరందుకుంది. తాజాగా దానిపై స్పందించిన ఆయన ఇప్పట్లో పార్టీ మారనని తెలిపారు.


First published: June 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు