మరికాసేపట్లో కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా ప్రముఖ టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంపై ట్వీట్ చేశారు. ‘నీరే జీవనానికి ఆధారం. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతం’ అంటూ నాగ్ ట్వీట్ చేశారు. మానవ ఇంజనీరింగ్ మేథకు ఓ మచ్చుతునక. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఆల్ ది బెస్ట్’ అని నాగ్ ట్వీట్ చేశారు. అంతే కాదు తన ట్వీట్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ సీఎం కార్యాలయానికి ట్యాగ్ చేశారు.
కాసేపట్లో కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మేడిగడ్డలో సతీసమేతంగా ఆయన జలసంకల్ప యాగంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, తెలుగురాష్ట్రాల గవర్నర్ నరసింహన్ హాజరయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత వేగంగా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేశారు. ఒక బ్యారేజీలా కాకుండా 3 బ్యారేజీలు, 19 పంపు హౌజులు, వందల కిలోమీటర్ల కాలువలతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 13 జిల్లాల్లోని 18 లక్షల 25 వేల ఎకరాలకు కొత్తగా నీరిస్తారని అధికారులు చెబుతున్నారు. దారి పొడవునా ఉండే గ్రామాలకు, హైదరాబాద్‌కు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరు ఇవ్వాలనీ ప్రణాళిక రూపొందించారు.
Water is life!! All the best for the inauguration of the largest lift irrigation project in the world!! #KaleshwaramProject a marvel of human engineering!!! @KTRTRS@TelanganaCMO