AKHILESH YADAV STEPS INTO FATHER MULAYAMS SHOES FOR 2019 POLLS TO CONTEST FROM AZAMGARH MS
ఈసారి తండ్రి స్థానం నుంచి పోటీ చేయబోతున్న అఖిలేశ్ యాదవ్..
అఖిలేశ్ యాదవ్ (File)
Akhilesh Yadav Contesting From Azamghar : ఎస్పీ-బీఎస్పీలకు కలిపి అజంఘర్‌లో 63శాతం ఓటు బ్యాంకు ఉంది. కాబట్టి ఒకవిధంగా అఖిలేశ్ యాదవ్ సేఫ్ సీటును ఎంచుకున్నట్టే అని చెప్పాలి. తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి అఖిలేశ్ యాదవ్ పోటీ చేస్తుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
తండ్రి ములాయం సింగ్ యాదవ్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) పగ్గాలు చేజిక్కించుకున్న అఖిలేశ్ యాదవ్.. ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లోనూ తండ్రి వారసత్వాన్ని కొనసాగించబోతున్నారు.ఇదివరకు ములాయం పోటీ చేస్తూ వచ్చిన అజంఘర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇప్పుడు అఖిలేశ్ యాదవ్ పోటీ చేయబోతున్నారు. ఆదివారం ఎస్పీ విడుదల చేసిన 40మంది లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో అఖిలేశ్ పేరు కూడా ఖరారైంది.
అజంఘర్ నుంచి పోటీ చేయడం ద్వారా తండ్రి ములాయంకు అసలైన వారసుడిని అన్న సందేశాన్ని అఖిలేశ్ జనంలోకి పంపిస్తున్నారు. అంతేకాదు, ఇక్కడి నుంచి తాను పోటీ చేస్తే పూర్వాంచల్‌లో పార్టీ బలోపేతమవుతుందని భావిస్తున్నారు. ముస్లింలు, బీసీల ప్రాబల్యం అధికంగా ఉండే అజంఘర్ నియోజకవర్గంలో 1989 నుంచి ముస్లిం లేదా యాదవ సామాజిక వర్గానికి చెందినవారే గెలుస్తూ వస్తున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ యూపీ లోక్‌సభ ఎన్నికలను స్వీప్ చేయగా.. అంతటి హవాలోనూ ములాయం సింగ్ యాదవ్ ఇక్కడి నుంచి 63వేల ఓట్లతో గెలుపొందారు.
ఎస్పీ-బీఎస్పీలకు కలిపి అజంఘర్‌లో 63శాతం ఓటు బ్యాంకు ఉంది. కాబట్టి ఒకవిధంగా అఖిలేశ్ యాదవ్ సేఫ్ సీటును ఎంచుకున్నట్టే అని చెప్పాలి. తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి అఖిలేశ్ యాదవ్ పోటీ చేస్తుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.మరోవైపు ములాయం సింగ్ యాదవ్ ఈసారి మొయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. లోక్‌సభ అభ్యర్థుల జాబితాతో పాటే స్టార్ క్యాంపెయినర్ల జాబితా కూడా విడుదల చేసిన ఎస్పీ.. అందులో ములాయంకు స్థానం కల్పించకపోవడం గమనార్హం. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో అఖిలేశ్, అజంఖాన్, రాంగోపాల్ యాదవ్, జయా బచ్చన్, డింపుల్ యాదవ్ ఉన్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.