AKHILESH WILL DROWN JAYANT BABU VOICE AMIT SHAH SAYS THE RLD CHIEF WONT BENEFIT FROM HIS TIE UP WITH THE SP PVN
UP Polls : వాళ్లతో వద్దు బాబు వచ్చేయ్..చౌదరికి అమిత్ షా గాలం
అమిత్ షా(ఫైల్ ఫొటో)
Sha On RLD Chief Jayant Chaudhary : సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటై మూడోరోజే "ఆర్ఎల్డి చీఫ్ జయంత్ చౌదరి"బయటకు నెట్టివేయబడతారని మరియు జైలులో ఉన్న ఎస్పీ నాయకుడు అజం ఖాన్ అతని స్థానంలో వచ్చి అఖిలేష్ పక్కన కూర్చుంటారని అమిత్ షా అన్నారు.
Amit Shah On SP- RLD Alliance : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం(UP Assembly Elections)సమాజ్ వాదీ పార్టీ(SP)తో జట్టు కట్టిన తమ మాజీ మిత్రపక్షం రాష్ట్రీయ లోక్ దళ్(RLD)ని తిరిగి దగ్గర చేసుకునేందుకు బీజేపీ ఇప్పుడు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా స్వయంగా రంగంలోకి దిగి SP-RLD కూటమిని విడదీయడానికి తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. RLD రాక కోసం బీజేపీ ద్వారాలు తెరిచే ఉందంటూ..ఆ పార్టీ అధినేత జయంత్ చౌదరిని మచ్చిక చేసుకునేందుకు అమిత్ షా మరోసారి ప్రయత్నించారు. అఖిలేశ్ యాదవ్ గత చరిత్రను గుర్తు చేస్తూ జయంత్ చౌదరిను హెచ్చరించారు. గురువారం బులంద్ షహర్ జిల్లాలోని అనుప్ షహర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా(Amith Shah)మాట్లాడుతూ.."ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. అఖిలేష్ యాదవ్ ప్రజలను కలవడు,మీడియా సమావేశాల్లో మాత్రమే పాల్గొంటాడు. మా జయంత్ జీని తన పక్కన పెట్టుకున్నాడు. యూపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అఖిలేష్ బాబు తన మాట వింటాడని జయంత్ చౌదరి భావించాడు. జయంత్ బాబు, ఇది అపోహ. తన సొంత నాన్న, మామ మాటలు వినని వ్యక్తి మీ మాట ఎలా వింటాడు" అని షా అన్నారు.
జయంత్ చౌదరికి(RLD Chief)అఖిలేశ్ యాదవ్ నచ్చజెప్పి, తన కూటమిలో చేర్చుకోగలిగారు. అయితే తన గళాన్ని వినిపించే అవకాశాన్ని జయంత్ కు ఇవ్వరని షా అన్నారు. ఒకవేళ సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే తన గళం మునిగిపోతుందని జయంత్ బాబుకు తెలియడం లేదన్నారు. సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటై మూడోరోజే "ఆర్ఎల్డి చీఫ్ జయంత్ చౌదరి"బయటకు నెట్టివేయబడతారని మరియు జైలులో ఉన్న ఎస్పీ నాయకుడు అజం ఖాన్ అతని స్థానంలో వచ్చి అఖిలేష్ పక్కన కూర్చుంటారని అమిత్ షా అన్నారు. అయితే అమిత్ షా ఈ విధంగా జయంత్ చౌదరికి గేలం వేయడం ఇది రెండోసారి. జయంత్‌కు అమిత్ షా గేలం వేయడం వెనుక జాట్ల ఓట్లను చీల్చాలనే లక్ష్యం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు జయంత్‌కు ముస్లింల మద్దతు కూడా ఉందని చెప్తున్నారు.
జనవరి 26న జాట్ నేతలతో సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ, ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి(RLD Chief Jayant Chaudhary) తప్పుడు గృహాన్ని ఎంచుకున్నారన్నారు. ఆయన కోసం బీజేపీ తలుపులు తెరిచే ఉన్నాయనే సంకేతాలు ఇచ్చారు. అయితే మత విద్వేషాలకు కారణమయ్యే బీజేపీతో తాను ఎప్పటికీ చేతులు కలపబోనని జయంత్ చౌదరి ఆ సమయంలో తెలిపారు. అమిత్ షా కలుపుకోవాల్సింది తనను కాదని, రైతుల ఉద్యమంలో ఇళ్లు కోల్పోయిన 700 కుటుంబాలను అని జయంత్ చౌదరి హితవు పలికారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తాను బీజేపీలో చేరొచ్చనే అనుమానాల్ని సృష్టించడం ద్వారా ముస్లిం ఓట్లను పొందకుండా అడ్డుకోవడానికి అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు జయంత్ వ్యాఖ్యానించారు. అమిత్ షా చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యలతో ముస్లింలు.. బీఎస్పీకి కానీ లేదా ఎంఐఎంకు ఓటు వేస్తారని తెలిపారు. ఇది కేవలం ముస్లిం ఓట్లను విభజించడానికి అమిత్ షా వేస్తున్న ఎత్తుగడగా జయంత్ అభివర్ణించారు. అమిత్ షా హర్యానాలో చేసినట్లుగా యూపీలోనూ జాట్లను ఒంటరి చేయాలనుకుంటున్నారని, కానీ తాను అలా జరగనివ్వనని జయంత్ తెలిపారు. యూపీ ఎన్నికల తర్వాతే కాదు, తాను ఎప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా తన పార్టీ ఆర్ఎల్డి పని అయిపోతుందని వ్యాఖ్యానించారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.