మళ్లీ అజిత్ పవార్ కలకలం.. ఫోన్ స్విచ్చాఫ్..

మళ్లీ అజిత్ పవార్ కలకలం.. ఫోన్ స్విచ్చాఫ్..

అజిత్ పవార్,శరద్ పవార్

అజిత్ పవార్ ఉద్దేశపూర్వకంగానే ఆయన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నారా? లేక మళ్లీ ఏమైనా జరుగుతోందా? అన్న చర్చ కూడా మొదలైంది.

  • Share this:
    శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే ప్రమాణ స్వీకారానికి అంతా సిద్దమైనవేళ.. ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఫోన్ స్విచ్చాఫ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. ఉద్దేశపూర్వకంగానే ఆయన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నారా? లేక మళ్లీ ఏమైనా జరుగుతోందా? అన్న చర్చ కూడా మొదలైంది.అయితే విపరీతంగా ఫోన్ కాల్స్ వస్తుండటంతో.. కావాలనే ఆయన తన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడని ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. సాయంత్రం జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని చెప్పాయి.

    కాగా,శరద్ పవార్‌తో రాజీ కుదరడంతో డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి అజిత్ పవార్ తిరిగి సొంతగూటికి చేరిన సంగతి తెలిసిందే. దీంతో మహా రాజకీయం అనేక మలుపులు తిరిగి చివరకు శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కలిసి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి.
    Published by:Srinivas Mittapalli
    First published: