Home /News /politics /

AJAY CHAUTALA WILL BE RELEASED AS DUSHYANT CHAUTALA TO TAKE OATH AS HARYANA DEPUTY CM SK

రేపు దుశ్యంత్ ప్రమాణస్వీకారం.. తీహార్ జైలు నుంచి తండ్రి విడుదల

దుశ్యంత్ చౌతలా

దుశ్యంత్ చౌతలా

శనివారం సాయంత్రం గానీ, ఆదివారం ఉదయం గానీ ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. కుమారుడు దుశ్యంత్ చౌతలా ప్రమాణస్వీకారానికి హాజరుకానున్నారు అజయ్ చౌతలా.

    హర్యానా హంగ్ రాజకీయం కొలిక్కి వచ్చింది. బీజేపీ, జేజేపీ మధ్య ఒప్పందం కుదిరింది. జేజేపీ అధ్యక్షుడు దుశ్యంత్ చౌతాలాకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించింది. ఇక హర్యానా సీఎంగా మనోహర్‌లాల్ ఖట్టర్ మరోసారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆదివారం దీపావళి వేళ హర్యానాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్, డిప్యూటీ సీఎంగా జననాయక్ జనతా పార్టీ అధ్యక్షుడు దుశ్యంత్ చౌతలా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఛండీగఢ్‌లో గవర్నర్‌ను కలిసిన మనోహర్ లాల్ ఖట్టర్, దుశ్యంత్ చౌతలా.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. దానికి గవర్నర్ అంగీకరించారని..ఆదివారం మధ్యాహ్నం 02.15 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని చెప్పారు ఖట్టర్. ఐతే ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న దుశ్యంత్ చౌతలా తండ్రి అజయ్ చౌతలాకు ఫర్లో (furlough) దక్కింది. ఫర్లో అంటే.. ఏడాదిలో రెండు వారాల పాటు ఖైదీలు సెలవు తీసుకోవడం..! అజయ్‌కు రెండు వారాల పాటు ఫర్లో మంజూరు చేస్తున్నట్లు తీహార్ జైలు డీజీ తెలిపారు. దాంతో శనివారం సాయంత్రం గానీ, ఆదివారం ఉదయం గానీ ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. కుమారుడు దుశ్యంత్ చౌతలా ప్రమాణస్వీకారానికి హాజరుకానున్నారు అజయ్ చౌతలా.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bjp, Dushyant Chautal, Haryana, Haryana assembly election 2019, Jjp

    తదుపరి వార్తలు