అసెంబ్లీలో కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వ్యతిరేకించిన ఎంఐఎం

MIM Oppose CM KCR Proposal: పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలన్న తీర్మానాన్ని ఎంఐఎం వ్యతిరేకించింది.

news18-telugu
Updated: September 8, 2020, 3:07 PM IST
అసెంబ్లీలో కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వ్యతిరేకించిన ఎంఐఎం
తెలంగాణ సీఎం కేసీఆర్
  • Share this:
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రతిపాదించిన తీర్మానాన్ని మిత్రపక్షం ఎంఐఎం వ్యతిరేకించింది. భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతి సంవత్సరంలో ఆయనకు భారతరత్న ఇవ్వాలంటూ సీఎం కేసీఆర్ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ‘ పీవీ నరసింహారావు అసమానప్రతిభావంతుడు. విమర్శలకు వెరువని నేత. అలాంటి మహనీయుడు, తెలంగాణ ముద్దుబిడ్డ, ప్రపంచమేధావి, బహుబాషావేత్త, అపరచాణిక్యుడు, ప్రగతిశీలి, సంపన్న భారత నిర్మాత, జాతిరత్నమై భాసిల్లిన నాయకునికి మరణానంతరం భారతరత్న పురస్కారం ఇచ్చి భారత జాతి తనను తాను గౌరవించుకోవాలి. ఇప్పటికే ఆలస్యం అయింది. పీవీ శతజయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న ఈ సందర్భంలో వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో భారతరత్న బిరుదు ప్రకటించడం సముచితంగా ఉంటుంది.’ అని కేసీఆర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ‘ తెలంగాణ బిడ్డ, దక్షిణ భారత దేశం నుంచి తొలిసారి ప్రధాన పదవికి ఎన్నికైన రాజనీతిజ్ఞుడు, నూతన ఆర్థిక సంస్కరణల సారధి, అరుదైన దౌత్యనీతి కోవిదుడు, బహుబాషావేత్త, దేశభవితకు ఉజ్వలమైన దారులు నిర్మించిన దార్శనికుడు, భారత రాజకీయాలలో మేరునగధీరుడు, భారత రాజకీయాల్లో అసాధారణ ప్రజ్ఞాశాలి పాములపర్తి వెంకట నరసింహారావుకు మరణానంతరం భారతరత్న పురస్కారం ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రకటించారు. పార్లమెంట్ ప్రాంగణంలో ఆ మహనీయుడి విగ్రహం, చిత్తరువు ప్రతిష్టించాలి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పీవీ పేరు పెట్టాలి.’ అని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

అయితే, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని టీఆర్‌ఎస్‌ మిత్రపక్షమైన ఎంఐఎం వ్యతిరేకించింది. వీపీకి భాతతరత్న ఇవ్వాలన్న తీర్మాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించిన ఎంఐఎం ఆ సమయంలో సభ నుంచి వాకౌట్‌ చేసింది. అయినప్పటికీ తీర్మాన్నీ సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 8, 2020, 3:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading