ఆ మున్సిపాలిటీలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు సున్నా సీట్లు...

భైంసా మున్సిపాలిటీలో ఎంఐఎం పార్టీ జెండా ఎగరేసింది. ఆ పార్టీ మెజారిటీ సీట్లు సాధించింది.

news18-telugu
Updated: January 25, 2020, 1:40 PM IST
ఆ మున్సిపాలిటీలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు సున్నా సీట్లు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జోరు కొనసాగుతోంది. మెజారిటీ మున్సిపాలిటీల్లో కారు దూసుకుపోతోంది. అయితే, భైంసా మున్సిపాలిటీలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. భైంసా మున్సిపాలిటీలో 26 వార్డులు ఉన్నాయి. అందులో ఎంఐఎం పార్టీకి 15, బీజేపీ 9 వార్డుల్లో విజయం సాధించాయి. స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు విజయం సాధించారు. తెలంగాణలో మిగిలిన నియోజకవర్గాల్లో ప్రభంజనం సృష్టిస్తున్న టీఆర్ఎస్ పార్టీ భైంసాలోని ఒక్క వార్డులో బోణీ కొట్టలేకపోయింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా కనీసం ఒక్క వార్డులో కూడా విజయం సాధించలేకపోయింది.

తెలంగాణలోని 9 మున్సిపల్ కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో ఈనెల 22న ఎన్నికలు జరిగాయి. కరీంనగర్ కార్పొరేషన్‌కు 24న ఎన్నికలు జరిగాయి. అన్నింటి ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను పరిశీలిస్తే.. 97 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ 13, బీజేపీ 2, ఎంఐఎం 2, ఇతరులు 3 చోట్ల గెలుపొందారు. మున్సిపల్ కార్పొరేషన్లలో ఏడింటిని టీఆర్ఎస్ విజయం సాధించింది.

First published: January 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు