సోషల్ మీడియాలో ఎంఐఎం రికార్డు.. ఆ ఖాతా ఉన్న తొలి రాజకీయ పార్టీ

AIMIM TIKTOK : ఎంఐఎం టిక్‌టాక్ ఖాతాకు సంబంధించి దారుస్సలాంలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మంగళవారం ఒక ప్రకటన విడుదలైంది. టిక్‌టాక్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నవారిలో యువత అధికంగా ఉండటంతో.. వారికి చేరువయ్యేందుకే అందులో ఖాతా తెరిచినట్టు వెల్లడించింది.

news18-telugu
Updated: September 25, 2019, 7:15 AM IST
సోషల్ మీడియాలో ఎంఐఎం రికార్డు.. ఆ ఖాతా ఉన్న తొలి రాజకీయ పార్టీ
ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ (File Photo)
news18-telugu
Updated: September 25, 2019, 7:15 AM IST
ఫేస్‌బుక్,వాట్సాప్‌లను మించి ఇటీవలి కాలంలో యూత్‌ను ఎక్కువగా ఆకర్షించిన యాప్ టిక్‌టాక్.చిన్నా పెద్దా తేడా లేకుండా.. అంతా టిక్‌టాక్‌తో పండుగ చేసుకుంటున్నారు.కొంతమంది పొద్దస్తమానం అందులోని వీడియోల్ని వీక్షిస్తూ కాలక్షేపం చేస్తుంటే.. మరికొందరు తమ నటనా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు వాడుతున్నారు.అయితే ఇంతలా జనాలను ఆకర్షిస్తున్న ఈ యాప్‌పై రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు దృష్టి సారించాయి.క్రియేటివ్ వీడియోలతో జనాన్ని తమ పార్టీల వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఐఎం పార్టీ
టిక్‌టాక్‌లో అధికారిక ఖాతా తెరిచింది. 'టిక్‌ టాక్‌'లో అధికారిక ఖాతా తెరిచిన తొలి రాజకీయ పార్టీగా ఎంఐఎం రికార్డులకెక్కింది.

ఎంఐఎం టిక్‌టాక్ ఖాతాకు సంబంధించి దారుస్సలాంలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మంగళవారం ఒక ప్రకటన విడుదలైంది. టిక్‌టాక్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నవారిలో యువత అధికంగా ఉండటంతో.. వారికి చేరువయ్యేందుకే అందులో ఖాతా తెరిచినట్టు వెల్లడించింది. కాగా, ప్రస్తుతం ఎంఐఎం అధికారిక టిక్‌టాక్ ఖాతాను దాదాపు 7వేల మంది ఫాలో అవుతున్నారు.

First published: September 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...