వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీకి నెలకు రూ.1,11,116/- ఇస్తున్న దాత.. ఎవరంటే..

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ అనే పథకాన్ని తెచ్చారు.

news18-telugu
Updated: July 19, 2019, 8:18 PM IST
వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీకి నెలకు రూ.1,11,116/- ఇస్తున్న దాత.. ఎవరంటే..
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన దానేటి శ్రీధర్
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకానికి తమవంతుగా సాయం చేసేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. తాజాగా న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌‌లో పనిచేస్తున్న డాక్టర్ దానేటి శ్రీధర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం కోసం రూ.1,11,116/- చెక్కు ఇచ్చారు. ఏపీ సెక్రటేరియట్‌లో సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన ఆయన చెక్కును అందజేశారు. ఇకపై ప్రతి నెలా ఇంతే మొత్తాన్ని తాను డొనేట్ చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. డాక్టర్ దానేటి శ్రీధర్ ఎయిమ్స్‌లో పనిచేస్తున్నారు. దానేటి శ్రీధర్ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో సేవా సంస్థను కూడా నిర్వహిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ అనే పథకాన్ని తెచ్చారు. వైద్యానికి రూ.1000 కంటే ఎక్కువ ఖర్చు అయితే, దాన్ని ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ సేవలు పొందవచ్చు.

First published: July 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading