మాదగ్గర కేసీఆర్ ఓ కూలీ: గులాం నబీ ఆజాద్

Telangana assembly elections2018|తెలంగాణ ఎన్నికల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఢిల్లీ నేతలు. తెలంగాణలో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం.. ప్రముఖ నేతలందరినీ రంగంలోకి దించింది.

news18-telugu
Updated: December 4, 2018, 5:19 PM IST
మాదగ్గర కేసీఆర్ ఓ కూలీ: గులాం నబీ ఆజాద్
కేసీఆర్, ఆజాద్ (ఫైల్ ఫొటోలు)
  • Share this:
తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థుల కోసం ఏఐసీసీ నేతలు.. విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఢిల్లీ కాంగ్రెస్ నేతలు.. టీఆర్ఎస్‌పై విరుచుకుపడుతున్నారు. రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్.. కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

తాను రాష్ట్ర కాంగ్రెస్ సెక్రెటరీగా ఉన్నప్పుడు.. కేసీఆర్ తమ దగ్గర కూలీలా ఉండేవాడని ఆజాద్ అన్నారు. కాంగ్రెస్ పుణ్యమా అని ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని ఎద్దేవా చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. కేసీఆర్ కుటుంబసభ్యులు కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారని విమర్శించారు. డబ్బు సంపాదన కోసమే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.
Published by: Santhosh Kumar Pyata
First published: December 4, 2018, 5:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading