ఏపీ కాంగ్రెస్‌కు కొత్త రక్తం... మాజీ సీఎంకు కీలక పదవి...

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఆఫీస్ బేరర్స్ జాబితాను ఏఐసీసీ ప్రకటించింది. కో ఆర్డినేషన్ కమిటీలో సభ్యుడిగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి చోటు ఇచ్చింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఆఫీస్ బేరర్స్ జాబితాను ఏఐసీసీ ప్రకటించింది. కొన్ని రోజుల క్రితం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా సాకే శైలజానాథ్‌‌ను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం తాజాగా ఓ భారీ జాబితాను విడుదల చేసింది. వారిలో 11 మంది ఉపాధ్యక్షులు, 18 మంది ప్రధాన కార్యదర్శులు, 29 మందితో కో ఆర్డినేషన్, 18 మంది జిల్లాల అధ్యక్షులు (కార్పొరేషన్ ఉన్న నగరానికి ఓ అధ్యక్షుడు, మిగిలిన జిల్లాకు రూరల్ అధ్యక్షుడు), 12 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీని నియమించింది. కో ఆర్డినేషన్ కమిటీకి చైర్మన్‌గా సాకే శైలజానాథ్ వ్యవహరిస్తారు. ఆకమిటీలో సభ్యుడిగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి చోటు ఇచ్చింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: