• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • AIADMK EXPELLED LEADER SASIKALA TO REACH TAMILNADU ON ON FEB 7 SSR

sasikala vs aiadmk: తమిళనాడులో అడుగుపెట్టగానే అక్కడికి వెళ్లాలనుకున్న శశికళకు షాకిచ్చిన అన్నాడీఎంకే ప్రభుత్వం

sasikala vs aiadmk: తమిళనాడులో అడుగుపెట్టగానే అక్కడికి వెళ్లాలనుకున్న శశికళకు షాకిచ్చిన అన్నాడీఎంకే ప్రభుత్వం

శశికళ(ఫైల్ ఫొటో)

తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే, శశికళ మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. రోజుకో ట్విస్ట్‌తో అత్యంత ఆసక్తికరంగా మారాయి. నిన్నమొన్నటి దాకా శశికళ కారుపై అన్నాడీఎంకే జెండా చిహ్నం హాట్ టాపిక్ అయితే.. తాజాగా శశికళ తమిళనాడు ఎంట్రీ ఎలా ఉండబోతుందోనన్న అంశం చర్చనీయాంశంగా మారింది. శశికళ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు గమనిస్తున్న అన్నాడీఎంకే ప్రభుత్వం..

  • Share this:
    చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే, శశికళ మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. రోజుకో ట్విస్ట్‌తో అత్యంత ఆసక్తికరంగా మారాయి. నిన్నమొన్నటి దాకా శశికళ కారుపై అన్నాడీఎంకే జెండా చిహ్నం హాట్ టాపిక్ అయితే.. తాజాగా శశికళ తమిళనాడు ఎంట్రీ ఎలా ఉండబోతుందోనన్న అంశం చర్చనీయాంశంగా మారింది. శశికళ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు గమనిస్తున్న అన్నాడీఎంకే ప్రభుత్వం ఎత్తుకు పై ఎత్తు వేస్తూ శశికళకు చెక్ పెట్టాలని భావిస్తోంది. తాజాగా అలాంటి పరిణామమే శశికళ వర్సెస్ అన్నాడీఎంకే ఎపిసోడ్‌లో చోటుచేసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన శశికళ తమిళనాడులో అట్టహాసంగా అడుగుపెట్టాలని భావిస్తున్నారు.

    అంతేకాదు, ఫిబ్రవరి 7న చెన్నైకి చేరుకోగానే మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి వద్దకు వెళ్లాలని శశికళ నిర్ణయించుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన అనంతరం జయలలిత సమాధి వద్దకు వెళ్లిన శశికళ శపథం కూడా చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ ఫొటోలు, వీడియోలు చర్చనీయాంశంగా మారాయి. మళ్లీ ఇప్పుడు కూడా జయ సమాధి వద్దకు వెళ్లాలనుకుంటున్న శశికళ భావోద్వేగానికి లోనై.. తన రాజకీయ ప్రణాళికను అక్కడి నుంచే ప్రకటించే అవకాశం ఉంది. అదే జరిగితే.. జయ అభిమానుల్లో శశికళపై కొంత సానుభూతి వ్యక్తమయ్యే అవకాశం ఉందని భావించిన అన్నాడీఎంకే ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఆమె ఎత్తుకు పైఎత్తు వేసింది. జయలలిత సమాధికి తుది మెరుగులకు సంబంధించిన పనులు కొనసాగుతున్నందున 15 రోజుల పాటు ఎవరికీ సందర్శనకు అనుమతి లేదని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. జయలలిత సమాధి సందర్శనపై ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధం విధించడంతో అక్కడికి వెళ్లాలనుకున్న శశికళకు నిరాశే ఎదురైంది. ఇలా శశికళ ఎత్తుకు అంతే వేగంగా అన్నాడీఎంకే చెక్ పెట్టింది.

    శశికళ తమిళనాడుకు రాకముందే రాజకీయం ఇంత ఆసక్తిగా మారితే, ఆమె రాష్ట్రంలో అడుగుపెట్టాక పరిస్థితి ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఇదిలా ఉంటే.. శశికళ ఫిబ్రవరి 7న బెంగళూరు నుంచి చెన్నైకి చేరుకోనున్నారు. ఏడవ తేదీ ఉదయం 7.30 గంటలకు బెంగళూరులో బయల్దేరి కర్ణాటక-తమిళనాడు సరిహద్దులోని అత్తిపల్లికి చేరుకోనున్నారు. అక్కడ శశికళ అనుచరులు ఆమెకు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. తమిళనాడు సరిహద్దులో మహిళా కార్యకర్తలతో మంగళహారతులు, పూర్ణకుంభంతో శశికళకు స్వాగతం పలకనున్నారు. శశికళ మహిళా సింహంలా కదిలారని, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా తమకు మార్గదర్శనం చేస్తారని దినకరన్ వ్యాఖ్యానించడం విశేషం. పార్టీలోని విద్రోహ శక్తులు మళ్లీ అధికారంలోకి రాకుండా చట్టపరంగా శశికళ అడ్డుకుంటారని దినకరన్ చేసిన వ్యాఖ్యలు అన్నాడీఎంకేలో చర్చకు దారితీశాయి.
    Published by:Sambasiva Reddy
    First published:

    అగ్ర కథనాలు