Home /News /politics /

AHEAD OF UP POLLS KHATAULI BJP MLA CHASED AWAY BY VILLAGERS OF HIS CONSTITUENCY PVN

UP Election : ప్రచారానికి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే..గ్రామస్థుల దెబ్బకు పరార్!

ఎమ్మెల్యేని వెంబడించిన గ్రామస్థులు

ఎమ్మెల్యేని వెంబడించిన గ్రామస్థులు

Uttar Pradesh Election : ఉత్తరప్రదేశ్ లోని ఖతౌలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న విక్రమ్ సింగ్ సైనీ...బుధవారం తన నియోజకరవ్గంలోని ఒక గ్రామంలో సమావేశానికి హాజరైనప్పుడు స్థానికుల ఆగ్రహాన్ని ఎదుర్కొన్నారు. కాగా, ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదికి పైగా రైతుల ఆందోళన తర్వాత ఇటీవల కేంద్రప్రభుత్వం ఆ చట్టాలను రద్దు చేయగా..ఈ అంశం మీదనే ఎమ్మెల్యేపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ లో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే పోలింగ్ షెడ్యూల్ ని ఎన్నికల కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో పోలింగ్‌ జరగనుంది.

ఇంకా చదవండి ...
BJP MLA Vikram Singh : ఉత్తరప్రదేశ్ లో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే పోలింగ్ షెడ్యూల్ ని ఎన్నికల కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో పోలింగ్‌ జరగనుంది. మార్చి-10న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇక,పోలింగ్ తేదీలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని మరింత స్పీడప్ చేశాయి. 2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 403 సీట్లలో 312 సీట్లు, దాదాపు 40 శాతం ఓట్లను గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు కూడా అదే జోరు కొనసాగించాలని,అధికారాన్ని నిలబెట్టుకోవడానికి పావులు కదుపుతుండగా,ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న లక్ష్యంతో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బీజేపీకి తనదైన స్టైల్ లో కౌంటర్లు ఇస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

ఇక,బీఎస్పీ అధినేత్రి మాయావతి మాత్రం ప్రచారంలో వెనుకబడింది. అసలు బీఎస్పీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందా అనే అనుమానం కలిగేలా ఉంది ఆ పార్టీ ప్రచార తీరు. మరోవైపు,కాంగ్రెస్ తరపున ప్రియాంకగాంధీ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకర్షించేలా ఆమె ప్రచారం,వాగ్దానాలు ఉంటున్నారు. ఇక, మొన్నటివరకు బీజేపీలో నుంచి సమాజ్ వాదీ పార్టీలోకి వలసల పర్వం కొనసాగగా..బుధవారం ఏకంగా అఖిలేష్ యాదవ్ సోదరుడు ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణ యాదవ్ ని బీజేపీలో చేర్చకుని ఎస్సీకి గట్టి ఝలక్ ఇచ్చింది బీజేపీ.

ALSO READ  EVMs వద్దు బ్యాలెట్ పేపరే ముద్దు : పిల్ పరిశీలనకు సుప్రీం అగీకారం -ఈవీఎంలు రాజ్యంగబద్ధమేనా?

ఇక,ఇదిలా ఉంటే ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి వెళ్లిన నేతలపై పలు చోట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడం, తమ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి చేయకుండా కేవలం ఓట్ల సమయంలోనే వస్తారా పలు చోట్ల వినూత్న రీతిలో నేతలకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు తెలపడం తెలిసిందే. కొన్ని ఘటనల్లో అయితే ఎమ్మెల్యే అభ్యర్థులపై దాడులకు కూడా పాల్పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్ లోని ఓ బీజేపీ ఎమ్మెల్యేకి ఎదురైంది. ఎన్నికల ఎన్నికల ప్రచారంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ సైనీని ముజఫర్‌నగర్‌ జిల్లాలోని అతని సొంత నియోజకవర్గం గ్రామస్థులు తరిమికొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉత్తరప్రదేశ్ లోని ఖతౌలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న విక్రమ్ సింగ్ సైనీ...బుధవారం తన నియోజకరవ్గంలోని ఒక గ్రామంలో సమావేశానికి హాజరైనప్పుడు స్థానికుల ఆగ్రహాన్ని ఎదుర్కొన్నారు. వైరల్ అవుతున్న వీడియోలో... గ్రామస్థుల సమూహం ఎమ్మెల్యే కారు వద్దకు వెళ్లికి అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం కనిపిస్తోంది. దీంతో ఎమ్మెల్యే సైనీ అక్కడి నుంచి కారులో వెంటనే గ్రామం వదిలి వెళ్లిపోయారు. కాగా, ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదికి పైగా రైతుల ఆందోళన తర్వాత ఇటీవల కేంద్రప్రభుత్వం ఆ చట్టాలను రద్దు చేయగా..ఈ అంశం మీదనే ఎమ్మెల్యేపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక, యూపీలో ఇటీవలి కొద్ది నెలల్లో నియోజకవర్గాల్లో ప్రచారానికి వెళ్లిన పలువురు బీజేపీ నేతలకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైన విషయం తెలిసిందే.

ALSO READ  Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో పొత్తులపై బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కీలక ప్రకటన..

కాగా,ఎమ్మెల్యే విక్రమ్ సైనీ గతంలో పలుసార్లు సంచలన ప్రకటనలు చేసి వార్తల్లో నిలిచారు. 2019 లో..భారతదేశంలో అసురక్షితంగా భావించే వారిపై "బాంబు" వేస్తానని బెదిరించాడు. దానికి ఒక ఏడాది ముందు, "మన దేశాన్ని హిందుస్థాన్ అంటారు, అంటే హిందువుల దేశం" అని అన్నారు. "ఆవులను చంపేవారి కాళ్లు విరగ్గొడతాను" అని కూడా బెదిరించి వార్తల్లో నిలిచారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: 5 State Elections, Bjp, Uttarpradesh

తదుపరి వార్తలు