బీజేపీకి షాక్...37 మంది నేతల మూకుమ్మడి రాజీనామా

BJP-NDPP ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అమలుచేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో నాగాలాండ్ ప్రయోజనాల కోసమే బీజేపీకి గుడ్‌బై చెప్పినట్లు స్పష్టంచేశారు.

Shiva Kumar Addula | news18-telugu
Updated: April 9, 2019, 8:24 PM IST
బీజేపీకి షాక్...37 మంది నేతల మూకుమ్మడి రాజీనామా
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీకి షాక్ తగిలింది. నాగాలాండ్‌లో బీజేపీకి చెందిన 37 మంది నేతలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను నాగాలాండ్ బీజేపీ నాయకత్వంతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు పంపించారు. బీజేపీ అవలంబిస్తున్న హిందూత్వం విధానం తమకు నచ్చడం లేదని లేఖలో పేర్కొన్నారు. పార్టీ తమ పట్ల వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందని ఆరోపించారు. అటు పార్టీ సంస్థాగత కార్యదర్శి అనంత్ మిశ్రా వ్యహార శైలిపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నాగాలాండ్ ప్రజల శ్రేయస్సును కోరే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.

బీజేపీ తీరుపై నాగాలాండ్ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వాళ్లు ఆరోపించారు. 2015లో ఏర్పాటైన ఇండో- నాగా శాంతి చర్చలు ముందుకు సాగడం లేదని...నాగా ప్రజల అభీష్టాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదని విమర్శించారు. పౌరసత్వ సవరణ బిల్లుతో నాగాలాండ్ ఉనికికే ముప్పుపొంచి ఉందని..ఐనా బీజేపీ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. BJP-NDPP ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అమలుచేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలోనే నాగాలాండ్ ప్రయోజనాల కోసమే బీజేపీకి గుడ్‌బై చెప్పినట్లు స్పష్టంచేశారు. ఐతే ఎన్నికల సమయంలో ఈ వ్యవహారం బీజేపీకి ఇబ్బందికరంగా మారింది.

ఇవి కూడా చదవండి:

Exclusive : ప్రధాని నరేంద్ర మోదీతో న్యూస్‌18 ఇంటర్వ్యూ

బీజేపీ కాన్వాయ్‌పై మావోయిస్టుల దాడి..ఎమ్మెల్యే సహా ఆరుగురు మృతి
First published: April 9, 2019, 8:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading