మాజీ మంత్రికి బిగ్ షాక్.. కుమారుడిపై హత్యాయత్నం కేసు

హసన్ జిల్లాలో బీజేపీ కార్యకర్తలపై దాడి చేసి హత్యాయత్నం చేశారన్న ఆరోపణల నేపథ్యలో వారిపై ఎఫ్ఐఆర్ నమోదయింది.

news18-telugu
Updated: December 4, 2019, 8:19 PM IST
మాజీ మంత్రికి బిగ్ షాక్.. కుమారుడిపై హత్యాయత్నం కేసు
రేవణ్ణ
  • Share this:
కర్నాటకలో ఉప ఎన్నికల వేళ మాజీ ప్రధాని దేవెగౌడ ఫ్యామిలీకి బిగ్ షాక్ తగిలింది. ఎన్నికలకు ఒక్క రోజు ముందు మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ కుమారుడిపై హత్యాయత్నం కేసు నమోదయింది. రేవణ్ణ కుమారుడు సూరజ్‌తో పాటు మరో ఐదుగురిపై చెన్నరాయపట్న పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలైంది. హసన్ జిల్లాలో బీజేపీ కార్యకర్తలపై దాడి చేసి హత్యాయత్నం చేశారన్న ఆరోపణల నేపథ్యలో వారిపై ఎఫ్ఐఆర్ నమోదయింది.

FIRలో పొందుపరిచిన వివరాల ప్రకారం..  జేడీఎస్ నుంచి బీజేపీలో చేరిన నేతలపై సూరజ్, అతని అనుచరులు దాడి చేశారు. ఆ రోజు ఓ బాధితుడి ఇంటికి సుమారు 150-200 మంది వచ్చి బీజేపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. కర్రలతో వారిని చితకబాది చంపేస్తామని బెదిరించారు. అంతేకాదు పలు వాహనాలను సైతం ధ్వంసం చేశారు. గాయపడ్డ వారిని చెన్నరాయపట్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాగా, డిసెంబరు 5న కర్నాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. కుమారస్వామి బలపరీక్ష సందర్భంగా 15 మంది ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించడంతో వారిపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. ఈ నేపథ్యంలో ఆయా స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. డిసెంబరు 23న ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.

 
First published: December 4, 2019, 8:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading