ఏపీ తెలంగాణలో రూ.2వేల నోటు మాయం.... ఎన్నికల వేళ ఎక్కడ దాక్కుంది?

Personal Finance: ఈ స్కీమ్‌లో డబ్బులు పెడితే మీ డబ్బులు రెండింతలు (ప్రతీకాత్మక చిత్రం)

ఎవరైనా ఏటీఎంలో డబ్బులు డ్రా చేసినా కూడా... రూ.500, రూ.200, రూ.100 నోట్లే వస్తున్నాయి. ఎక్కడ కూడా రూ.2000నోటు కనిపించడం లేదు.

  • Share this:
    ఏటీఎంకు వెళ్లి డబ్బులు డ్రా చేస్తే... అందరికీ ఓ టెన్షన్ ఉండేది. అది ఏంటంటే.. రూ.2వేల నోటు వస్తే.. చిల్లర దొరుకుతోందో లేదో అన్న టెన్షన్ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం జనాలకు ఆ ఆందోళన లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏటీఎంలలో రెండువేల నోట్లు లేవు. ఎవరైనా డబ్బులు డ్రా చేసినా కూడా... రూ.500, రూ.200, రూ.100 నోట్లే వస్తున్నాయి. ఎక్కడ కూడా రూ.2000నోటు కనిపించడం లేదు. ఏటీఎంలో కూడా లేదు. జనం వరకు బాగానే ఉంది. కానీ రెండువేల నోటుకు ఏమైంది. పెద్ద నోటు ఎక్కడికి పోయింది. పింక్ నోట్ కొన్నిరోజులుగా కనిపించకపోవడంతో ఇప్పుడు అందరిలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. అయితే పెద్ద నోటు కనిపించకపోవడానికి కారణం ఎన్నికలే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

    ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు, తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రెండువేల నోటు మాయమవుతోంది. రాజకీయ పార్టీల నేతలు, ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారు రెండు వేల నోట్లు దాచారంటున్నారు రాజకీయ నిపుణులు. అందుకే హైదరాబాద్‌లో కూడా ఎక్కడ ఏటీఎంలలో పెద్ద నోట్లు ఏ మాత్రం కనిపించడం లేదు. మరోవైపు ఇదే సమయంలో పోలీసులు పట్టుకుంటున్న డబ్బులో కూడా ఎక్కువ మొత్తంలో రెండువేల నోట్లే కనిపిస్తున్నాయి.

    గత సంవత్సరం మార్చిలో దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీలో సగానికి పైగా ఉన్న రూ. 2 వేల నోట్లు, ఈ సంవత్సరం మార్చికి వచ్చే సరికి 37.3 శాతానికి తగ్గింది. ఆర్బీఐ వెల్లడించిన డేటా ప్రకారం మార్చి 2017 నాటికి మొత్తం 3,285 మిలియన్లు, మార్చి 2018 నాటికి 3,363 మిలియన్ల రూ. 2 వేల నోట్లు చెలామణిలో ఉన్నాయి.
    First published: