ప్రధాని మోదీకి బిగ్ షాక్.. కేజ్రీవాల్‌కు నితీష్ కుమార్ మద్దతు

బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలన్న నితీష్ కుమార్.. అలాగే ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించాాలని అన్నారు.

news18-telugu
Updated: October 23, 2019, 6:24 PM IST
ప్రధాని మోదీకి బిగ్ షాక్.. కేజ్రీవాల్‌కు నితీష్ కుమార్ మద్దతు
నితీష్, ప్రధాని మోదీ, కేజ్రీవాల్
  • Share this:
బీజేపీ మిత్రపక్ష పార్టీ జేడీయూ ప్రధాని మోదీకి షాకిచ్చారు. కేజ్రీవాల్ డిమాండ్‌కు బీహార్ సీఎం నితీష్ కుమార్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలన్న నితీష్ కుమార్.. అలాగే ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించాాలని అన్నారు. వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.

ఇప్పటికే బీజేపీ, జేడీయూ మధ్య గ్యాప్ పెరిగింది. మోదీ రెండోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టాక తన కేబినెట్‌లో జేడీయూకు ఒకే ఒక్క మంత్రి పదవి ప్రతిపాదించారు. దాన్ని తిరస్కరించిన జేడీయూ.. కేంద్ర కేబినెట్‌‌కు దూరంగా ఉంది. అంతేకాదు బీజేపీపై తమ రాష్ట్రం బీహార్‌లో ప్రతీకారం తీర్చుకున్నారు నితీష్. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో బీజేపీకి ప్రాధాన్యం తగ్గించారు. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని ప్రచారం జరిగింది.

దీనిపై ఇటీవలే కేంద్ర మంత్రి అమిత్ షా న్యూస్ 18 ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. బీహార్‌లో జేడీయూ-బీజేపీకి కలిసే పోటీచేస్తాయని చెప్పారు. నితీష్ కుమార్ నాయకత్వంలో బీజేపీ పనిచేస్తుందని ఆయన చెప్పారు. బీహార్‌లో నితీష్ సారథ్యంలో.. జాతీయ స్థాయిలో మోదీ నాయకత్వంలో పనిచేస్తామని స్పష్టంచేశారు. ఈ క్రమంలో నితీష్ కుమార్ మరోసారి బీహార్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తేవడంతో పాటు ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది.
First published: October 23, 2019, 6:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading