• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • AHEAD OF BIHAR ELECTIONS BJPS USHA VIDYARTHI JOINS LJP IN PASHWAN PRESENCE DETAILS HERE MS

Bihar Elections 2020: బీహార్ లో బీజేపీకి షాక్.. ఎల్జేపీ లో చేరిన ఆ పార్టీ కీలకనేత

Bihar Elections 2020: బీహార్ లో బీజేపీకి షాక్.. ఎల్జేపీ లో చేరిన ఆ పార్టీ కీలకనేత

ఫైల్ ఫోటో

అసెంబ్లీ ఎన్నికల సమరం దగ్గరపడుతున్న కొద్ధీ బీహార్ లో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఒంటరిపోరుకు సిద్ధమైన ఎల్జేపీ.. సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నది.

  • News18
  • Last Updated:
  • Share this:
    కొద్దిరోజుల్లో తొలిదశ ఎన్నికలు మొదలవనున్న బీహార్ లో.. రాజకీయ నాయకుల జంపింగ్ లు షురూ అయ్యాయి. ఒక పార్టీ నుంచి టికెట్ ఆశించి.. సీట్ రానివారిని వేరే పార్టీలు.. ‘మా పార్టీలోకి రండి’ అంటూ రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. ఈసారి జేడీ(యూ)తో విబేధించి.. ఒంటరిపోరుకు దిగుతున్న ఎల్జేపీ.. కేంద్రంలో బీజేపీకి మద్దతిస్తున్నామంటూనే ఆ పార్టీ నుంచి అసంతృప్తులకు గాలం వేస్తున్నది.

    ఈ క్రమంలో.. బీహార్ బీజేపీ లో కీలక నాయకుడు, ముఖ్యమంత్రి రేసులో ఆ పార్టీ నుంచి ముందు వరుసలో ఉండే రాజేంద్ర సింగ్.. ఎల్జేపీలో చేరగా తాజాగా కమలం పార్టీకి చెందిన మరో కీలకనేత ఉషా విద్యార్థి కూడా ఎల్జేపీ కండువా కప్పుకున్నారు. బుధవారం ఆమె ఢిల్లీలోని ఎల్జేపీ కార్యాలయంలో చిరాగ్ పాశ్వాన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఇదే విషయమై ఆమె స్పందిస్తూ.. బీహార్ ను అభివృద్ధి పథంలో నడిపించడానికి పాశ్వాన్ తీసుకున్న ‘బీహారీ ఫస్ట్’ నినాదం తనకు బాగా నచ్చిందని ఆమె చెప్పారు.

    కాగా, రాజేంద్ర సింగ్, ఉషా విద్యార్థితో పాటు మరికొందరు నేతలు కూడా ఎల్జేపీలో చేరే అవకాశమున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జేడీ(యూ), బీజేపీ ల మధ్య ఇప్పటికే సీట్ల పంపిణీ ముగిసింది. ఆ కూటమి నుంచి వెళ్లిపోయిన ఎల్జేపీ.. ఒంటరి గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది. గత చరిత్రేమీ ఘనంగా లేకున్నా.. జేడీ(యూ) కంటే రెండు సీట్లైనా ఎక్కువగా సాధిస్తామని ఆ పార్టీ అగ్రనేత చిరాగ్ పాశ్వాన్ చెబుతున్నారు. బీజేపీతో కేంద్రంలో స్నేహం ఉంటుందంటూనే.. రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడేవారికి చోటు కల్పించేందుకు రెడీ అవుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులు నిలిపిన చోట తాను అభ్యర్థిని నిలబెట్టమని పైకి చెబుతున్నా.. దానిపైనా స్పష్టత లేదు. అయితే ఇది బీజేపీ కంటే.. నితీశ్ కే ఎక్కువ నష్టం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ లో.. మూడు ఫేజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈనెల 28న తొలిదశకు తెరలేవనుండగా.. నవంబర్ 3, 7 న రెండు, మూడు దశలలో ఎలక్షన్లు నిర్వహించనున్నారు. నవంబర్ 10న ఫలితాలు విడుదలవ్వనున్నాయి.
    Published by:Srinivas Munigala
    First published: