• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • AHEAD OF 2019 POLLS AND DRYING PARTY COFFERS RAHUL HANDS TREASURER MANTLE TO TRUSTED AIDE AHMED PATEL

కోశాధికారిగా అహ్మద్ పటేల్...కాంగ్రెస్ వ్యూహం ఇదే..!

కోశాధికారిగా అహ్మద్ పటేల్...కాంగ్రెస్ వ్యూహం ఇదే..!

అహ్మద్ పటేల్ (ఫైల్ ఫొటో)

ఎన్నికల ఏడాదిలో నిధుల సమీకరణను సమర్థవంతంగా నిర్వహించగల సామర్థ్యం ఆయనకే ఉందని హైకమాండ్ నమ్ముతోంది. పార్టీకి వచ్చే విరాళాలు ఇటీవల తగ్గిపోయాయి. ఈ క్రమంలోనే పార్టీకి నిధులను పెంచేందుకు..గతంలో కోశాధికారిగా పనిచేసిన అనుభవం ఉన్న అహ్మద్ పటేల్‌ను ఆ స్థానంలో కూర్చోబెట్టింది.

 • Share this:
  బర్త్ డే రోజున కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌కు అపూర్వ కానుక లభించింది. ఆయన్ను కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా నియమిస్తూ ప్రకటన జారీ చేశారు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. మోతిలాల్ వోహ్రా స్థానంలో ఆయన్ను నియమించారు. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అశోక్ గెహ్లాట్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇక మోతిలాల్‌కు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలను అప్పగించారు.

  2019 ఎన్నికల నేపథ్యంలో వ్యూహాత్మకంగానే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ఏడాదిలో నిధుల సమీకరణను సమర్థవంతంగా నిర్వహించగల సామర్థ్యం ఆయనకే ఉందని హైకమాండ్ నమ్ముతోంది. పార్టీకి వచ్చే విరాళాలు ఇటీవల తగ్గిపోయాయి. ఈ క్రమంలోనే పార్టీకి నిధులను పెంచేందుకు..గతంలో కోశాధికారిగా పనిచేసిన అనుభవం ఉన్న అహ్మద్ పటేల్‌ను ఆ స్థానంలో కూర్చోబెట్టింది. 18 ఏళ్ల తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీ కోశాధికారి బాధ్యతలు చేపట్టబోతున్నారు అహ్మద్ పటేల్.


  అహ్మద్ పటేల్‌నే ఎందుకు ఎంపిక చేశారు?
  1. నెహ్రూ-గాంధీ ఫ్యామిలీకి అహ్మద్ పటేల్ అత్యంత నమ్మకస్తుడు.
  2. గుజరాత్ నుంచి 8 సార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. భారుచ్ నుంచి 3 సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికవగా.. మరో ఐదుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.
  3. సోనియా అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో పార్టీ కోశాధికారిగా పనిచేసిన అనుభవం ఉంది.
  4. యూపీఏ కూటమిని సమర్ధవంతంగా నిర్వహించడంతో అహ్మద్ పటేల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
  5. కాంగ్రెస్ పార్లమెంటరీ సెక్రటరీ, గుజరాత్ కాంగ్రెస్ యూనిట్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కూడా అహ్మద్ పటేల్‌కు ఉంది.

  మరోవైపు పార్టీ విదేశీ వ్యవహారాల విభాగం చైర్‌పర్సన్‌గా మాజీ కేంద్ర మంత్రి ఆనంద్‌ శర్మ, అసోం మినహా ఇతర ఈశాన్య రాష్ట్రాలకు పార్టీ ఇన్‌చార్జ్‌గా లుజిన్హో సలేరియోను రాహుల్ గాంధీ నియమించారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలోకి మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ను శాశ్వత ఆహ్వానితులుగా నియమించారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  అగ్ర కథనాలు