• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • AGENDA INIDA AGAIN BJP WILL COME INTO POWER WITH FULL MAJORITY SAYS AMIT SHAH MS

బీజేపీదే మళ్లీ అధికారం.. అవినీతిపరులను వదిలిపెట్టేది లేదు : అమిత్ షా

బీజేపీదే మళ్లీ అధికారం.. అవినీతిపరులను వదిలిపెట్టేది లేదు : అమిత్ షా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా

Amit Shah in Agenda India : బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత దేశంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు మరింత తగ్గిపోయిందని.. ఎన్డీయే సంఖ్యాబలం పెరుగుతోందని అన్నారు. ప్రజలు ఎయిర్‌ఫోర్స్, ఆర్మీని నమ్మని పరిస్థితి ఇంకా దేశంలో రాలేదని.. కానీ కొంతమంది నేతలకు మాత్రం నమ్మకం లేదన్నారు.

  • Share this:
    బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని.. అవినీతిపరులను వదిలిపెట్టేది లేదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో 23, ఈశాన్య రాష్ట్రాల్లో 20 ఎంపీ సీట్లు గెలుస్తామని చెప్పారు.ఒడిశాలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని ధీమా వ్యక్తం చేశారు. అమేథీలో ఈసారి రాహుల్ గాంధీకి టఫ్ ఫైట్ తప్పదని.. అందుకే ఆయన వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నాడని విమర్శించారు. దేశంలో నల్లధనం తగ్గిపోయిందని.. తాము తీసుకుంటున్న చర్యలతో ఇంగ్లాండ్‌లో ఉన్నవాళ్లు (నీరవ్ మోదీ) కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. సర్జికల్ స్ట్రైక్స్ లాంటి నిర్ణయం పదేళ్ల క్రితమే తీసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. సైన్యంతో ఎవరు పెట్టుకున్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. సర్జికల్ స్ట్రైక్ కావచ్చు.. ఎయిర్ స్ట్రైక్ కావచ్చు.. భారత ఆత్మరక్షణకు సంబంధించి మోదీ ప్రభుత్వం ఏ చర్యలైనా తీసుకుంటుందన్నారు. జాతీయ భద్రతే మోదీ ప్రభుత్వానికి ప్రథమ బాధ్యత అని చెప్పారు. న్యూస్18 అజెండా ఇండియా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.

    బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత దేశంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు మరింత తగ్గిపోయిందని.. ఎన్డీయే సంఖ్యాబలం పెరుగుతోందని అన్నారు. ప్రజలు ఎయిర్‌ఫోర్స్, ఆర్మీని నమ్మని పరిస్థితి ఇంకా దేశంలో రాలేదని.. కానీ కొంతమంది నేతలకు మాత్రం నమ్మకం లేదన్నారు. ఎన్నికలు అనేవి జాతీయ వాదం పైనే జరగాలని..జాతీయ వాదంతో ఎన్నికలు నిర్వహించడానికి తప్పేంటి? అని ప్రశ్నించారు.రాజ్యసభలో బీజేపీకి ఇప్పటివరకు మెజారిటీ లేదని.. 2020 నాటికి అది కూడా సాకారం అవుతుందని అన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లును విపక్షాలు ఆమోదించనివ్వవు అని.. కానీ, ముస్లిం మహిళలకు సమాన హక్కు కల్పించాలమన్న మా నిబద్దతకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.

    నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ సర్కార్ త్రివిధ దళాల కోసం 15 ఏళ్ల ప్రణాళికను రూపొందించిందని.. యూపీఏ హయాంలో అలాంటిదేమీ చేయలేదని అన్నారు. రక్షణ శాఖ నిధులు తగ్గించామనే వాదన సరికాదని.. లెక్కలు చూస్తే అది మీకే తెలుస్తుందని అమిత్ షా అన్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్‌ని గ్లోబల్ లీడర్‌గా చూస్తోందని.. అదే తాము సాధించిన అతి పెద్ద విజయం అని స్పష్టం చేశారు. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి తాము ఎంతో చేశామని, టెర్రరిస్టులకు నిధులు ఇచ్చే సంస్థలను కూడా నిషేధించామని అన్నారు. కశ్మీర్ యువతకు మంచి భవిష్యత్తు అందాలంటే.. అక్కడ శాంతి నెలకొనాలని పేర్కొన్నారు.

    First published:

    అగ్ర కథనాలు