టీఆర్ఎస్‌లో సీట్ల లొల్లి.. ఖైరతాబాద్‌పై కిరికిరి

టీఆర్ఎస్ పార్టీలో నిరసనలు సద్దుమణిగాయనుకునే లోపు .. ఆశావహులు మళ్లీ గళం విప్పుతున్నారు. ఆందోళనలకు దిగుతున్నారు. దీంతో అధికార పార్టీకి మళ్లీ తలనొప్పి మొదలైంది.

news18
Updated: November 12, 2018, 4:25 PM IST
టీఆర్ఎస్‌లో సీట్ల లొల్లి.. ఖైరతాబాద్‌పై కిరికిరి
దానం నాగేందర్, మన్నె గోవర్దన్ (ఫైల్ ఫొటో)
  • News18
  • Last Updated: November 12, 2018, 4:25 PM IST
  • Share this:
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై, పోలింగ్ డేట్ సమీపిస్తున్న వేళ.. టీఆర్ఎస్ పార్టీకి మరోసారి నిరసనసెగ తగిలింది. ఖైరతాబాద్ సీటు కోసం కొట్లాట మొదలైంది. ఆ సీటును మన్నె గోవర్దన్‌రెడ్డికి కేటాయించాలంటూ.. ఆయన అనుచరులు తెలంగాణ భవన్ ఎదుట ఆందోళనకు దిగారు. నినాదాలతో హోరెత్తించారు.

రెండు నెలల క్రితం ప్రభుత్వాన్ని రద్దుచేసి.. ఆ వెంటనే 105 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ కొన్ని స్థానాలను మాత్రం పెండింగ్‌లో పెట్టారు. వాటిపై పార్టీలో నిర్ణయించి, పలు సర్వేలు చేసిన తర్వాత గెలుపు అవకాశాలున్న అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. ఆ లిస్టులో ఖైరతాబాద్ స్థానం కూడా ఉంది. ఇప్పుడదే సీటు ఆందోళనలకు కారణమైంది.

జూబ్లిహిల్స్ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న మన్నె గోవర్దన్ రెడ్డి.. ఖైరతాబాద్ నుంచి పోటీ చేయాలనుకున్నారు. అయితే, మాజీ మంత్రి దానం నాగేందర్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. ఖైరతాబాద్ నుంచి టీఆర్ఎస్ తరపున దానం నాగేందర్ బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో మన్నెగోవర్ధన్‌రెడ్డి.. ఆ సీటును ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన అనుచరులు తెలంగాణ భవన్ ముందు ఆందోళనకు దిగారు. ఖైరతాబాద్ టిక్కెట్ మన్నె గోవర్దన్‌కే ఇవ్వాలని డిమాండ్ చేశారు. గోవర్దన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు.First published: November 12, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com