ముఖ్యమంత్రులనూ వదలని ఈసీ.. హెలికాప్టర్లలో తనిఖీలు

కర్ణాటక సీఎం కుమారస్వామి, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లను ఎన్నికల అధికారులు సోదాలు చేశారు.

news18-telugu
Updated: April 17, 2019, 3:32 PM IST
ముఖ్యమంత్రులనూ వదలని ఈసీ.. హెలికాప్టర్లలో తనిఖీలు
కుమారస్వామి ఫైల్
  • Share this:
ఎన్నికల ప్రచారం సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రులను కూడా వదలడం లేదు. కర్ణాటకలో సీఎం కుమారస్వామి హెలికాప్టర్‌ను తనిఖీ చేశారు. శివమొగ్గలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటక సీఎం కుమారస్వామి వచ్చిన హెలికాప్టర్‌ను ఎలక్షన్ స్పెషల్ స్క్వాడ్ తనిఖీ చేసింది. కుమారస్వామి వచ్చిన హెలికాప్టర్‌లో ఆయనతో పాటు తీసుకొచ్చిన వస్తువులను తనిఖీ చేశారు. లగేజ్ చెక్ చేశారు. హెలికాప్టర్ మొత్తం సోదాలు నిర్వహించారు. గతంలో కూడా ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సందర్భంగా హసన్ పట్టణంలో కుమారస్వామి వాహనాలను తనిఖీ చేశారు. ఈనెల 16న బీజేపీ నేత, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప హెలికాప్టర్‌ను కూడా ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. ఆ తర్వాత రోజే సీఎం హెలికాప్టర్‌లో సోదాలు చేశారు. కర్ణాటక సీఎం ఒక్కరే కాదు. ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను కూడా ఎలక్షన్ అధికారులు సోదాలు చేశారు. రూర్కెలాలో ప్రచారం కోసం వెళ్లిన నవీన్ పట్నాయక్ హెలికాప్టర్‌ను అధికారులు చెక్ చేశారు.First published: April 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>