బీజేపీకి ఓటువేశాడు...వేలు నరుక్కున్నాడు....

తాను వేయదలుచుకున్న అభ్యర్థికి కాకుండా పొరపాటున వేరొక అభ్యర్థికి ఓటువేయడంతో...అతడు జీర్ణించుకోలేకపోయాడు. చేసిన తప్పుకు పశ్చాతాపంగా తనవేలును తానే నరుక్కున్నాడు.

news18-telugu
Updated: April 19, 2019, 6:43 AM IST
బీజేపీకి ఓటువేశాడు...వేలు నరుక్కున్నాడు....
వేలు నరుక్కున్న పవన్
news18-telugu
Updated: April 19, 2019, 6:43 AM IST
దేశంలో రెండోదశ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. పోలింగ్ సమయంలో ఆసక్తికర ఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. 90 ఏళ్లు నిండిన వృద్ధులు సైతం ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొనగా..కొన్ని ప్రాంతాల్లో పాతికేళ్ల యువకులు సైతం బద్ధకంతో ఓటువేయలేదు. ఐతే వీటన్నింటినీ మించి ఉత్తరప్రదేశ్‌లో ఓ ఓటర్ చేసిన పని దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాను వేయదలుచుకున్న అభ్యర్థికి కాకుండా పొరపాటున వేరొక అభ్యర్థికి ఓటువేయడంతో...అతడు జీర్ణించుకోలేకపోయాడు. చేసిన తప్పుకు పశ్చాతాపంగా తన వేలుని తానే నరుక్కున్నాడు.


25 ఏళ్ల పవన్ కుమార్ బులంద్ షహర్ లోక్‌సభ పరిధిలోని అబ్దుల్లాపూర్ హులాసన్ గ్రామంలో నివసిస్తున్నాడు. అతడ బీఎస్పీ వీరాభిమాని. గురువారం జరిగిన రెండో దశ ఎన్నికల్లో బీఎస్పీ-ఎస్పీ-ఆర్ఎల్డీ అభ్యర్థి యోగేశ్ వర్మకు ఓటువేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లాడు. ఐతే లోపలికి వెళ్లాక పొరపాటున బీజేపీ సిట్టింగ్ ఎంపీ భోలా సింగ్‌ ఓటువేశాడు. ఈవీఎంలో ఏనుగు గుర్తు మీద కాకుండా...కమలం గుర్తు మీటనొక్కాడు. దాన్ని జీర్ణించుకోలేకపోయిన పవన్.. పశ్చాతాపం కోసం తన వేలును తానే నరుక్కున్నాడు. ఓటు వేసిన చూపుడు వేలుని కత్తితో నరికేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


రెండో దశలో భాగంగా 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం సహా మొత్తం 95 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రాష్ట్రాల వారీగా చూసుకుంటే అసోం-5, బీహార్-5, ఛత్తీస్ గడ్-3, జమ్మూ కాశ్మీర్-2, కర్ణాటక-14, మహారాష్ట్ర-10, మణిపూర్-1, ఒడిశా-5, పుదుచ్చేరి-1, తమిళనాడు-38, ఉత్తరప్రదేశ్-8, పశ్చిమ బెంగాల్ -3 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. దాదాపు 1500 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.

First published: April 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...