• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • AFTER UPROAR OVER DIGVIJAYA SINGHS TWEET ONE OF BJPS OWN NOW CALLS PULWAMA ATTACK AN ACCIDENT

పుల్వామా ఉగ్రదాడి ‘ప్రమాద ఘటన’...బీజేపీ నేత సెల్ఫ్ గోల్

పుల్వామా ఉగ్రదాడి ‘ప్రమాద ఘటన’...బీజేపీ నేత సెల్ఫ్ గోల్

యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య(ఫైల్ ఫోటో)

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కామెంట్స్‌పై వివాదం సద్దుమణకముందే...సొంత పార్టీకి చెందిన నేత ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం బీజేపీకి ఇబ్బందికరంగా మారింది.

  • Share this:
    పుల్వామా ఉగ్రదాడి ‘ప్రమాద ఘటన’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చల్లారకముందే సొంత పార్టీ నేత ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. పుల్వామా దాడి ‘ప్రమాద ఘటన’ అంటూ మంగళవారం దిగ్విజయ్ సింగ్ చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బాలాకోట్‌లో ఉగ్రస్థావరంపై భారత వైమానిక దాడులపై అనుమానాలున్నాయని, దీనికి ఆధారాలుంటే చూపాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. దిగ్విజయ్ వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, వీకే సింగ్, పలువురు బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో పుల్వామా ఉగ్రదాడి ఘటనలో భద్రతా దళాల వైఫల్యం లేదని...అది ఓ పెద్ద ప్రమాద ఘటనగా పేర్కొంటూ యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య చేసిన వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి.

    మౌర్య కామెంట్స్‌కి సంబంధించిన వీడియోను ట్వీట్ చేసిన దిగ్విజయ్ సింగ్...‘పుల్వామా దాడి ఘటన ‘ప్రమాద ఘటన’గా నేనంటే...నేను పాక్ మద్దతుదారుడంటూ ముగ్గురు కేంద్ర మంత్రులు వ్యాఖ్యలు చేశారు...ఇప్పుడు కేశవ్ ప్రసాద్ మౌర్య ఏమన్నారో వినండి? మోడీ జీ, ఆయన మంత్రులు ఇప్పుడు ఏమంటారు?’ అంటూ ప్రశ్నించారు.



    తన వ్యాఖ్యలపై బీజేపీ నేతల విమర్శలను తిప్పికొట్టిన దిగ్విజయ్ సింగ్, దమ్ముంటే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు తనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సవాల్ చేశారు. పుల్వామా దాడి ఘటనలో ఇంటెలిజన్స్ వైఫల్యంపై ప్రధాని మోడీ ఏమి చర్యలు తీసుకున్నారు? ఈ ఘటనకు ఎవరు బాధ్యులు? ప్రధాని మోడీ లేదా మరెవరైనా దీనికి బాధ్యతవహిస్తారా?ఈ ఘటనపై ఎన్ఎస్ఏ, ఇంటెలిజన్స్ బ్యూరో చీఫ్, రా చీఫ్ వివరణ తీసుకున్నారా? అంటూ దిగ్విజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
    First published:

    అగ్ర కథనాలు