Kerala: ఇందిరా గాంధీ తర్వాత ఆమెకే బ్యానర్ కట్టారు.. ఎవరికంటే..

కేరళలో మమతా బెనర్జీ బ్యానర్​

కేరళలో ఇటీవల తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ బ్యానర్లు వెలిశాయి. “కాల్​ దీదీ.. సేవ్​ ఇండియా.. ఛలో ఢిల్లీ” అనే నినాదంతో కొంతమంది ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. 1970లో తమిళనాడులో ఇలాగే ఇందిరాగాంధీ కోసం బ్యానర్లు ఏర్పాటుచేశారు. ‘‘కాల్​ ఇందిరా.. సేవ్​ ఇండియా.. ఛలో ఢిల్లీ’’ అని.

 • Share this:
  మమతా బెనర్జీ.. దీదీగా ప్రసిద్ధి. పశ్చిమ బెంగాల్​ ముఖ్యమంత్రి. ఇండియాలో అత్యంత ప్రభావం చూపగలిగిన రాజకీయ నేతలలో ఆమె ఒకరు. ఇటీవలె బెంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎదురునిలిచి అన్నీ తానై ప్రచారం చేసింది. అఖండ మెజారిటీతో గెలిచి, సీఎం పీఠాన్ని తిరిగి దక్కించుకుంది. అయితే అప్పటివరకు రాష్ట్ర రాజకీయాలకే పరిమితమైన దీదీ.  దేశవ్యాప్తంగా బీజేపీ ప్రాభవాన్ని తగ్గించాలని నిర్ణయించుకుంది. అంతే ఇక దేశ రాజకీయాల వైపు పయనం మొదలెట్టింది. అందులో భాగంగా దక్షిణాదిలో సైతం తన ప్రాభవాన్ని విస్తరించాలని అడుగులు వేస్తోంది. అయితే తమిళనాడులో ప్రాంతీయ భావం ఎక్కువ. అందులోనూ నరేంద్ర మోదీ అంటే కొద్దిమందిలో వ్యతిరేక భావం సైతం ఉంది. ఎందుకంటే అక్కడి రాజకీయ శూన్యతను వాడుకుని అన్నాడీఎంకేను తన చెప్పుచేతుల్లోకి తెచ్చుకున్నారనే ఆరోపణ​ ఉంది. అదే స్టాలిన్​కు మేలు చేసి సీఎం కుర్చీ సంపాదించుకున్నారనే టాక్​ ఉంది. అయితే ఇటీవల దక్షిణాదిలో దీదీకి ప్రచారం గట్టిగానే జరుగుతోంది. కేరళలో అయితే ఓ అడుగు ముందుకేశారు. 50 ఏళ్ల క్రితం తమిళనాడులో జరిగింది రిపీట్​ చేశారు. అదేంటో తెలుసుకుందాం..

  అప్పట్లో ఇందిరా గాంధీ..

  ప్రస్తుతం కేరళలో లెఫ్ట్​ పార్టీ అధికారంలో ఉంది. పినరయి విజయన్​ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇటీవల కేరళలో ఇటీవల తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ బ్యానర్లు వెలిశాయి. “కాల్​ దీదీ.. సేవ్​ ఇండియా.. ఛలో ఢిల్లీ” అనే నినాదంతో కొంతమంది ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. 1970లో తమిళనాడులో ఇలాగే ఇందిరాగాంధీ కోసం బ్యానర్లు ఏర్పాటుచేశారు. ‘‘కాల్​ ఇందిరా.. సేవ్​ ఇండియా.. ఛలో ఢిల్లీ’’ అని. కాగా, తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ అధినేత్రి మమతా జాతీయ స్థాయి నాయకురాలిగా గుర్తిస్తున్నందుకు ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా దీదీనే అనుకుంటున్నారని వారు అభిప్రాయపడ్డారు. తృణమూల్​ కాంగ్రెస్​కు దక్షిణాదిలో పనిచేసే ఎలాంటి అనుబంధ సంస్థ లేకున్నాదీదీ ప్రాభవం అక్కడ కనిపించడం పట్ల ఆనందం వ్యక్తంచేశారు. టీఎంసీ జాతీయ స్థాయిలో విస్తరించాలనుకుంటున్న తరుణంలో ఇలాంటి వార్తలు చూడటం ఉత్తేజితులను చేస్తుందని రాజ్యసభ ఎంపీ సుఖేందు రాయ్​ వ్యాఖ్యానించారు. ఆకాశన్నంటే ధరలు, నిత్యవసర వస్తువుల ధరలు పెరగడం, రోగులకు ఆక్సిజన్​ అందించడంలో విఫలం కావడం, వ్యాక్సినేషన్​ అందరికీ అందుబాటులోకి రాకపోవడం, బ్యాంకులను, పబ్లిక్​ సెక్టార్​ కంపెనీలు, ఎయిర్​ఇండియా, ఆయిల్​, మైన్స్​ విభాగా​లు, పోర్టులు అమ్మడం, దేశంలో కనీసం మాట్లాడే అవకాశాలు ఇవ్వకపోవడం లాంటివన్నీ ఆగాలంటే దీదీ రావడమే సరైనదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక కేరళలో బ్యానర్లపై బీజేపీ స్పందిస్తూ.. మమతా బెనర్జీ ఎప్పటికీ ప్రధానమంత్రి కాలేరని ఎద్దేవా చేశారు.
  Published by:Prabhakar Vaddi
  First published: