Vangaveeti Radha Comments: వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు... సేమ్ టు సేమ్ పవన్ లాగానే..!

పవన్ కల్యాణ్, వంగవీటి రాధా (ఫైల్)

రాజమండ్రి సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కాపు సంఘాలు, కాపు సామాజిక వర్గానికి (Kapu Community) చెందిన నేతలు పవన్ కామెంట్స్ పై చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దివంగత వంగవీటి మోహన రంగా (Vangaveeti Mohana Ranga) కుమారుడు వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radha Krishna) సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh) ప్రస్తుతం కాపు సామాజికవర్గం (Kapu Caste) చర్చనీయాంశమవుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan), ఏపీ మంత్రుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో కాపుల విషయమే హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా మంత్రి పేర్ని నాని (Minister Perni Nani) చేసిన వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వచ్చింది. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కాపు సంఘాలు, కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు పవన్ కామెంట్స్ పై చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దివంగత వంగవీటి మోహన రంగా (Vangaveeti Mohana Ranga) కుమారుడు వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radha Krishna) సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను వంగవీటి రాధా రిపీట్ చేసినట్లుగా ఉంది. రాధా వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమవుతున్నాయి.

    ఆదివారం ఖమ్మంజిల్లా ఎర్రుబాలెం మండలం కొత్తపాలెం గ్రామంలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాధా హాజరయ్యారు. అనంతరం ప్రసంగించిన రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు. నా తండ్రి రంగాను అన్ని వర్గాల ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని.. తరాలు మారినా, యుగాలు మారినా ధరిత్రి ఉన్నంత వరకు రంగా గారు ఉంటారన్నారు. రంగా కాపులకు ఆరాధ్యదైవమైతే... అన్ని వర్గాల పేదల గుండె చప్పుడు అని వ్యాఖ్యానించారు.

    ఇది చదవండి: కాపులకు పవన్ కల్యాణ్ హితబోధ.. ఆ ముగ్గురిపై ఆసక్తికర వ్యాఖ్యలు


    గతంలో మన నాయకుడు రంగాని మనం కాపాడుకోలేక పోయామన్న రాధా... ఇప్పుడైనా ఆవేశం తగ్గించి ఆలోచనతో ఉన్న నాయకులను అయినా కాపాడుకోమని కోరుతున్నానన్నారు. నేడు పుట్టిన కులాన్ని తిట్టడం ప్రతి అడ్డమైనోడికి ఫ్యాషన్ అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లేదో గొప్పగా భావిస్తూ... పుట్టిన కులాన్ని వెటకారం చేస్తున్నారని రాధా మండిపడ్డారు. అంతా ఐక్యంగా ఉంటే ప్రభుత్వాలనే పడగొట్టే సత్తా ఉందని.. అందరూ ఐక్యమత్యంగా ఉంటూ ఉన్నవారినైనా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

    ఇది చదవండి: ఆ విషయంలో వైసీపీకి జనసేన సపోర్ట్.. స్వయంగా ప్రకటించిన పవన్ కల్యాణ్..


    పవన్ ఏమన్నారంటే..!
    రాజమండ్రి సభలో కులాల ప్రస్తావన తీసుకొచ్చిన పవన్.. కాపులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాపులు రాజకీయంగా ముందుండాలన్న పవన్.. గతంలో ఓ గొప్ప వ్యక్తిని సరైన సమయంలో తోడు లేక కోల్పోయారంటూ వంగవీటి రంగాను గుర్తు చేశారు. 2009లో ఒకరు వస్తే ఆయన్ను పలుచన చేశారని చిరంజీవిని గుర్తుచేశారు. , 2014 కాపు ఉద్యమాన్ని అణచివేస్తే అడ్డుకోలేకపోయారంటూ ముద్రగడ ఉగ్యమాన్ని గుర్తుచేశారు. కాపు, తెలగ, ఒంటరి, బలిజలు, ఒంటరి ముందుకు వస్తే తప్ప రాష్ట్రం బాగుపడదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.

    కుల పెద్దలు, నాయకులతో మాట్లాడి ఏక్కడ తప్పులు జరిగాయి..? ఎవరి చేతిలో మోసపోయాం..? అనేది ఆలోచించాలలన్నారు. మీరు ముందుకు వస్తే తప్ప శెట్టిబలిజలు, కొప్పుల వెలమ, తూర్పుకాపులు, దళితులు, మైనార్టీలు ముందుకురారని పిలుపునిచ్చారు. సమాజంలో కాపులు పెద్దన్న పాత్ర వహించాలని పిలుపునిచ్చారు. నిన్న పవన్, నేడు రాధా వ్యాఖ్యలు చేయడంతో రాజకీయాలు వేడెక్కాయి. త్వరలో పవన్-రాధా కలబోతున్నారా..? అనే చర్చ కూడా మొదలైంది.
    Published by:Purna Chandra
    First published: