మోదీకి రైతు సెగ... వారణాసి మరో నిజామాబాద్ కానుందా?

ప్రధాని మోదీ (File)

. సుమారు 50మంది రైతులు వారణాసిలో నామినేషన్ వేయనున్నారు. తమకు మ‌ద్ద‌తుగా త‌మిళనాడు రైతులు కూడా నామినేష‌న్ వేస్తున్నారని రైతు నాయ‌కులు తెలిపారు.

  • Share this:
    ప‌సుపు రైతుల సెగ ప్రధాని మోదీని తాక‌నుంది. ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి నుంచి బరిలో దిగేందుకు సిద్ద‌మైన నిజామాబాద్ జిల్లా రైతులు అక్కడకు బయలుదేరారు. ప‌సుపు రైతుల‌ స‌మ‌స్య దేశ‌వ్య‌ప్తంగా చర్చనీయ ఆంశం కావాల‌నే ఉద్దేశంతో అక్కడ నామినేష‌న్లు వేయనున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ప‌సుపు, ఎర్ర‌జొన్న‌ రైతులు గ‌త రెండు నెల‌లుగా ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు చేసారు. అయితే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు స్పందిక పోవ‌డంతో రైతులు లోక్‌సభ ఎన్నిక‌ల్లో పోటీకి దిగారు. మొద‌టి విడత‌ లోక్‌సభ ఎన్నిక‌ల్లో సీఎం కేసీఆర్ కుమార్తె, ఎంపీ క‌విత ప్రాతినిధ్యం వ‌హించిన నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి 178మంది నామినేషన్ వేశారు. దీంతో నిజామాబాద్ పార్ల‌మెంట్‌కు మొత్తం 185 మంది అభ్య‌ర్థులు పోటీలో నిలిచారు. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్ దేశంలోనే మొదటిసారి ఎం-3 ఈవీఎంల‌ను వినియోగించి పోలింగ్ ప్రక్రియ జరిపించింది.

    ఏకంగా దేశ ప్రదాన మంత్రి నరేంద్ర‌మోదీ పోటీ చేస్తున్న వార‌నాసి నుంచి పోటీ చేసేందుకు ఆర్మూర్ నుంచి రైతులు బ‌య‌లు దేరారు. తాము మోదీని ఓడించేందుకు పోటీ చేయడం లేదని, తమ ప్ర‌ధాన డిమాండ్ అయిన ప‌సుపు బోర్డును సాధించుకోవడానికే పోటీ చేస్తున్నామని చెప్పారు. స్వ‌చ్ఛందంగా చందాలు వేసుకుని నామినేష‌న్ వేస్తున్నామ‌ని రైతులు చెపుతున్నారు. ప‌సుపు పంట‌కు రూ.15వేల మ‌ద్ద‌తు ధర క‌ల్పించాల‌ని, ప‌సుపు బోర్డు ఏర్పాటు చేయాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. సుమారు 50మంది రైతులు వారణాసిలో నామినేషన్ వేయనున్నారు. తమకు మ‌ద్ద‌తుగా త‌మిళనాడు రైతులు కూడా నామినేష‌న్ వేస్తున్నారని రైతు నాయ‌కులు తెలిపారు.

    First published: