రమేష్ కుమార్ తర్వాత సీఎం జగన్ కొత్త టార్గెట్ ఆయనేనా?

నిమ్మగడ్డ రమేష్ కుమార్‌‌కు ఉద్వాసన పలికిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ ఎవరు?

news18-telugu
Updated: April 11, 2020, 2:28 PM IST
రమేష్ కుమార్ తర్వాత సీఎం జగన్ కొత్త టార్గెట్ ఆయనేనా?
ఏపీ సీఎం వైఎస్ జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌‌కు ఉద్వాసన పలికిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ ఎవరు? ప్రస్తుతం ఈ చర్చ రాజకీయవర్గాల్లో కొనసాగుతోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత నుంచి పరిణామాలను గమనిస్తే.. ఈసారి సీఎం టార్గెట్ ఏపీపీఎస్సీ చైర్మన్ పిన్నమనేని ఉదయ్ బాస్కర్ మీద ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ తరహాలోనే ఏపీ పబ్లిస్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవి కూడా రాజ్యాంగబద్ధమైనదే. దీన్ని కూడా ప్రభుత్వం ఆమోదంతో గవర్నర్ నియమిస్తారు. జగన్ సీఎం అయిన తర్వాత నుంచి ఏపీపీఎస్సీ చైర్మన్‌కు, ప్రభుత్వానికి మధ్య అంతగా సయోధ్య లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో APPSC కీలక నిర్ణయం, APPSC decide to conduct group 1 exam with tabs
ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్‌భాస్కర్‌


కొన్ని రోజుల క్రితం ఏపీపీఎస్సీ చైర్మన్ పిన్నమనేని ఉదయ్ భాస్కర్... జగన్ ప్రభుత్వంపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న తనను పక్కనపెట్టి ఇన్‌చార్జి చైర్మన్‌ను నియమించారని, తాను చేయాల్సిన పనులు అన్నీ సెక్రటరీతోనే చేయిస్తున్నారని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అలాగే, మూడు పేజీల లేఖను అందించినట్టు సమాచారం. కొన్ని రోజుల క్రితం ఏపీపీఎస్సీ సభ్యుడిని నేరుగా ఇన్‌చార్జి చైర్మన్‌గా నియమించారని, వాస్తవానికి ఇన్‌చార్జి చైర్మన్‌ను నియమించే అధికారం కేవలం గవర్నర్‌కు మాత్రమే ఉందని ఉదయ్ భాస్కర్ హరిచందన్‌కు చెప్పినట్టు తెలిసింది. ఆ రకంగా గవర్నర్ అధికారాలను కూడా జగన్ ప్రభుత్వం అతిక్రమిస్తోందని ఆయన ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

చంద్రబాబు హయాంలో 2015 నవంబర్ 25న ఏపీపీఎస్సీ చైర్మన్‌గా పి.ఉదయ్ భాస్కర్‌ను నియమిస్తూ జారీ అయిన ఉత్వర్వులు


ఏపీపీఎస్సీ చైర్మన్ అయిన తనకు కనీసం పేషీలో పీఏ కూడా లేడని, ఉన్న పీఏను కూడా తీసేశారని ఉదయ్ భాస్కర్ ఆరోపించారు. కనీసం డోర్ తీసే అటెండర్‌ను కూడా తీసేసి తనను అవమానించారని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. నాలుగు నెలల నుంచి తనకు ఒక్క ఫైల్ కూడా రాలేదని, చైర్మన్‌తో సంబంధం లేకుండా అన్ని పనులు సెక్రటరీతోనే చేయిస్తున్నారని ఆరోపించారు. తన ప్రమేయం లేకుండానే నాలుగు నెలలుగా అనేక రిక్రూట్‌మెంట్లు చేశారని కూడా తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నియమించారు కాబట్టే తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని గవర్నర్ హరిచందన్‌కు ఉదయ్ భాస్కర్ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.

2021 నవంబర్ 26 వరకు ఉదయ్ భాస్కర్ పదవీకాలం


పిన్నమనేని ఉదయ్ భాస్కర్ చంద్రబాబునాయుడు హయాంలో 2015 నవంబర్ 25న ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించారు. 2021 నవంబర్ 26 వరకు ఉదయ్ భాస్కర్‌కు పదవీకాలం ఉంది. అంటే, మరో ఏడాదిన్నర కాలం ఆయన ఏపీపీఎస్సీ చైర్మన్‌గా కొనసాగనున్నారు. పంచాయతీరాజ్ చట్టంలో సవరణలతో ఎస్ఈసీకి ఉద్వాసన పలికినట్టు ఏపీపీఎస్సీ చైర్మన్‌‌‌‌ను కూడా సాగనంపేందుకు ప్రభుత్వం ముందు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా? అని సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: April 11, 2020, 2:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading