AFTER MAJOR HINT ON CONGRESS UP CM FACE A CLARIFICATION FROM PRIYANKA GANDHI VADRA PVN
UP Election : ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ట్విస్ట్..సీఎం అభ్యర్థిత్వంపై ప్రియాంక గాంధీ యూటర్న్
ప్రియాంకగాంధీ(ఫైల్ ఫొటో)
Priyanka Gandhi : యూపీ కాంగెస్ సీఎం అభ్యర్థికి సంబంధించి చేసిన కామెంట్స్ ప్రియాంక గాంధీ వాద్రా ఇవాళ వెనక్కి తగ్గారు. తాను చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల అనంతర బీజేపీ మినహా ఏ పార్టీతోనైనా పొత్తులకు కాంగ్రెస్ పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని ప్రియాంక తెలిపారు.
Priyanka Gandhi : హోరాహోరీగా సాగుతున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో(Uttar Pradesh Assembly Election) బీజేపీ సీఎం అభ్యర్ధిగా యోగీ ఆదిత్యనాథ్, ఎస్పీ తరఫున అఖిలేష్ యాదవ్ సీఎం అభ్యర్ధులుగా ఉన్నారు. వీరి మధ్యలో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్ధిగా(Congress CM Candidate) ఎవరనే ప్రశ్న తలెత్తింది. దీంతో మీడియా పదే పదే ప్రశ్నించడంతో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా గురవారం పరోక్షంగా తానే సీఎం అభ్యర్థి అని వ్యా ఖ్యానించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో యూపీ ఎన్నికలకు సంబంధించి యూత్ మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీని విలేఖరులు ప్రశ్నించగా..సీఎం అభ్యర్థి కూడా తానే అన్న అర్థం వచ్చేలా ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నుండి మీకు వేరొకరి ముఖం కనిపిస్తుందా? మీరు నా ముఖాన్నే ప్రతిచోటా చూడవచ్చు అని ప్రియాంక గాంధీ సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. .
దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రియాంక గాంధీయే అనుకున్నారంతా. దీనిపై విస్తృతంగా చర్చ నడిచింది. వాస్తవానికి యూపీలో కాంగ్రెస్ కు పది సీట్లు రావడమే కష్టమని ఒపినీయన్ పోల్స్ చెబుతున్న తరుణంలో సీఎం అభ్యర్ధిత్వం గురించి మాట్లాడటంపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో యూపీ సీఎం అభ్యర్థికి సంబంధించి చేసిన కామెంట్స్ ప్రియాంక గాంధీ వాద్రా ఇవాళ వెనక్కి తగ్గారు. తాను చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.
కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తాను ప్రకటించుకోలేదని, ఆ మాట తాను చెప్పలేదని ప్రియాంక గాంధీ అన్నారు. తాను సీఎం అనే అర్థంలో ఆ కామెంట్స్ చేయలేదని ఇవాళ ఏఎన్ఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక గాంధీ అన్నారు. సీఎం ఎవరు అనేది పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని.. అలాంటి నిర్ణయం ఇంత వరకు జరగలేదన్నారు ప్రియాంక. అసలు తాను సీఎం అభ్యర్థిని అని అనలేదు.. ఎన్నికల్లో ప్రధాన పాత్ర మాత్రమే తనదని అన్నానన్నారు. సీఎం అభ్యర్థి గురించి పదేపదే మీడియా అడుగుతుండటంతో కాస్త అతిశయోక్తిగా చెప్పానని.. దానికి మీడియా మసాలా తగిలించిందని ప్రియాంక వివరణ ఇచ్చారు. చాలా రాష్ట్రాలకు కాంగ్రెస్, బీజేపీ తరఫున ఇన్ఛార్జులుగా పని చేస్తున్నారని... వాళ్లంతా ముఖ్యమంత్రి అభ్యర్థులా? వాళ్లను ఎందుకు మీరు ప్రశ్నలు అడగటం లేదని ప్రశ్నించారు ప్రియాంక.
ఇక, ఎన్నికల అనంతర బీజేపీ మినహా ఏ పార్టీతోనైనా పొత్తులకు కాంగ్రెస్ పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని ఇంటర్వ్యూలో ప్రియాంక తెలిపారు. సమాజ్వాదీ పార్టీ, బీజేపీ ఒకే తరహా విధానాలు అనుసరిస్తున్నాయని ప్రియాంక విమర్శించారు. మతతత్వం, కులతత్వం ఎజెండాతోనే రెండు పార్టీలు ముందుకు వెళ్తున్నాయని, పరస్పరం లబ్ధి చేకూర్చుకుంటున్నాయని అన్నారు. కాగా,యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.