వినాయకమండపంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే విగ్రహం...

ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి విగ్రహాన్ని వినాయక మండపంలో ఏర్పాటు చేశారు.

news18-telugu
Updated: September 8, 2019, 3:15 PM IST
వినాయకమండపంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే విగ్రహం...
గణేష్ మండపంలో జీవన్ రెడ్డి విగ్రహం, పక్కన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Image: Facebook)
  • Share this:
గణేష్ ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన వినాయకమండపంలో ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి విగ్రహాన్ని వినాయక మండపంలో ఏర్పాటు చేశారు. ఓ పక్కన గణేష్ విగ్రహం, ఆ పక్కనే జీవన్ రెడ్డి నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తన ఫొటో ఉన్న గణేష్ విగ్రహాన్ని సందర్శించిన జీవన్ రెడ్డి ఫొటో కూడా దిగారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన జీవన్ రెడ్డి ఫొటో వినాయకుడి మండపంలో పెట్టడం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే తెలంగాణలో శిల్పాల వివాదం తలెత్తుతోంది. యాదాద్రి ఆలయంలోని అష్టభుజి ప్రాకారంలోని స్తంభాలపై కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు, హరితహారం, కేసీఆర్ కిట్ వంటి పథకాలను చెక్కారు. ఇది పెను దుమారానికి దారి తీసింది. వాటితోపాటు సైకిల్, కమలం, గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి మరికొన్ని రాజకీయ చిత్రాలు ఉన్నా కూడా కేసీఆర్ ఫొటోల మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. యాదాద్రి ఆలయంలోని స్తంభాలపై కేవలం దైవ సంబంధిత చిత్రాలు మాత్రమే చెక్కించాలని, సీఎం కేసీఆర్ కానీ, ఇతరత్రా రాజకీయ చిహ్నాలు వద్దని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి భాస్కర్ రెడ్డి యాదాద్రి ఆలయ అభివృద్ధి అధారిటీని ఆదేశించారు. దీంతో యాదాద్రి ఆలయంలో రాజకీయ చిత్రాలు తొలగించనున్నారు.
First published: September 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading