విశాఖలో జగన్ ప్రతిపాదనకు నేవీ బ్రేకులు...?

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దూకుడుకు నేవీ బ్రేకులు వేసినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: February 22, 2020, 4:53 PM IST
విశాఖలో జగన్ ప్రతిపాదనకు నేవీ బ్రేకులు...?
నేవీ డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి
  • Share this:
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దూకుడుకు నేవీ బ్రేకులు వేసినట్టు తెలుస్తోంది. విశాఖలోని మిలీనియం టవర్స్‌ను సచివాలయంగా చేసుకుని అక్కడి నుంచి పరిపాలన చేయాలనుకున్న జగన్ ఆలోచనకు నేవీ అడ్డు చెప్పినట్టు తెలిసింది. ఈ మేరకు డెక్కన్ క్రానికల్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. విశాఖలోని రుషికొండ వద్ద మిలీనియం టవర్స్ ఉన్నాయి. దానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో INS కళింగ ఉంది. తూర్పు నావికాదళానికి కేంద్రమైన విశాఖలో ఈ ఐఎన్ఎస్ కళింగ కీలక స్థావరం. 734 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఉన్న ఈ ఐఎన్ఎస్ కళింగలో అత్యాధునిక ఆయుధాలను తయారు చేస్తోంది. సాంకేతికంగా అత్యున్నత స్థాయిగల మిసైల్స్‌కు ఈ ప్రాంగణం ఆధారం. అలాంటి కీలక ప్రాంతానికి దగ్గరగా ఉన్న మిలీనియం టవర్స్ వద్ద జనసంచారాన్ని పెంచుకుంటూ పోతే అది భద్రతా పరమైన సమస్యలకు దారి తీస్తుందంటూ నేవీ అభ్యంతరాన్ని లేవనెత్తినట్టు పేర్కొంది.

నేవీ డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి (File)


మరోవైపు నేవీకి, ఏపీ రెవిన్యూ శాఖకు మధ్య భూ వివాదం ఉంది. సుమారు 400 ఎకరాలకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. 1980ల్లో విశాఖ జిల్లా అధికారగణం నేవీకి 400 ఎకరాలను కేటాయించింది. అందులో ఆఫీసర్స్‌కు ఇళ్లు కట్టివ్వాలనేది నేవీ ప్లాన్. తాజాగా ఆ ప్రాంతానికి దగ్గరలో జనసంచారాన్ని పెంచే కార్యక్రమాలు చేపడితే అది సమస్యగా మారుతుందని నేవీ అభ్యంతరం చెప్పినట్టు తెలిసింది. దీంతో మిలీనియం టవర్స్‌లో సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసుకున్నట్టు తెలిసింది.

విశాఖలో నేవీ డే సెలబ్రేషన్స్ సందర్భంగా విన్యాసాలు


తాజాగా మిలీనియ టవర్ బీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.19.73 కోట్లను విడుదల చేసింది. టవర్ బీ నిర్మాణం కోసం ఐటీ శాఖకు నిధులను కేటాయిస్తూ జీవో జారీ చేసింది. మూడు రోజుల క్రితం విశాఖలో పర్యటించిన ఇద్దరు రాష్ట్ర మంత్రులు కీలక ప్రకటన చేశారు. విశాఖలో ఐటీకి కేటాయించిన మిలీనియం టవర్స్‌ను వేరే అవసరాలకు వినియోగించే ఆలోచన లేదని మంత్రులు మేకపాటి గౌతంరెడ్డి, అవంతి శ్రీనివాస్‌ చెప్పారు. ఫిబ్రవరి 19వ తేదీన రుషికొండలోని ఐటీ సెజ్‌ను ఇద్దరు మంత్రులు సందర్శించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: February 22, 2020, 4:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading